»   » నమ్మలేనంత డబ్బు : రోబో '2.0' చిత్రం శాటిలైట్‌ రైట్స్‌ ఎంతో తెలిస్తే అవాక్కై పోతారు

నమ్మలేనంత డబ్బు : రోబో '2.0' చిత్రం శాటిలైట్‌ రైట్స్‌ ఎంతో తెలిస్తే అవాక్కై పోతారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, ఇండియ‌న్ క్రేజీ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌డైన ద‌ర్శ‌కుడు శంక‌ర్ కాంబోలో తెర‌కెక్కిన భారీ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం రోబో 2.0. 2010లో తెరకెక్కిన ఈ సినిమా ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోను, ర‌జ‌నీ, శంక‌ర్ కేరీర్‌లోను తిరుగులేని హిట్‌గా నిలిచింది. అలాంటి హిట్ సినిమాకు సీక్వెల్‌గ తెర‌కెక్కుతోన్న రోబో 2.0 ఏకంగా రూ. 350 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోంది.

హాలీవుడ్‌ స్థాయిలో

హాలీవుడ్‌ స్థాయిలో

మళ్ళీ ఇదే కాంబినేషన్‌లో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న '2.0' చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టుగానే ఇండియన్‌ సినిమాలోనే భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో హాలీవుడ్‌ స్థాయిలో రూపొందుతున్న '2.0' చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ తమ మొదటి చిత్రంగా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ విలన్‌గా ఓ విభిన్నమైన పాత్ర పోషిస్తుండగా, ఎమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టుగానే

ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టుగానే

రోబో చిత్రానికి సీక్వెల్‌గా రజనీకాంత్‌, శంకర్‌ల కాంబినేషన్‌లో రోబో 2.0 చిత్రం రూపొందుతోందన్న వార్త బయటికి రాగానే ఈ చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఏర్పడ్డాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టుగానే బిజినెస్‌ పరంగా '2.0' సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది. శాటిలైట్‌ రైట్స్‌ కోసం కూడా భారీ పోటీ నెలకొంది.

110 కోట్లకు జీ తెలుగు

110 కోట్లకు జీ తెలుగు

అంతటి పోటీ మధ్య జీ టివి ఈ చిత్రం శాటిలైట్‌ రైట్స్‌ దక్కించుకుంది. తెలుగు, తమిళ్‌, హిందీ భాషల శాటిలైట్‌ రైట్స్‌ను 110 కోట్లకు జీ తెలుగు కైవసం చేసుకుంది. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి కావచ్చింది. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నారు. 'రోబో' తర్వాత రజనీకాంత్‌, శంకర్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ విజువల్‌ వండర్‌ శాటిలైట్‌ రైట్స్‌ 110 కోట్లకు అమ్ముడు పోవడం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయింది.

కబాలి లా ప్రమోట్ చేయాలని

కబాలి లా ప్రమోట్ చేయాలని

రీసెంట్‌గా రజనీకాంత్ కబాలికి వచ్చిన హైప్ ఏ సినిమాకీ రాలేదు. ఈ మూవీ రిలీజ్ కి ముందు చేసిన ప్రచారంతో సిని ఆడియన్స్ మొత్తం కబాలి ఫీవర్‌తో ఊగిపోయింది. అంతలా కబాలిని ప్రమోట్ చేశారు మేకర్స్. ఇప్పుడు రజనీ రోబో 2 మూవీని అంతకు మించిన రేంజ్ లో ప్రమోట్ చేయాలని శంకర్ తో పాటు యూనిట్ భావిస్తుందట.

1000 కోట్లు టార్గెట్

1000 కోట్లు టార్గెట్

తరువాత వరుసగా మూవీపై హైప్ పెరిగేలా ప్రమోషన్స్ ప్లాన్ రెడీ చేస్తారట. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్‌గా చేస్తున్న ఈ మూవీలో అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తోంది. రోబో 2తో బాక్సఫీసు వద్ద 1000 కోట్లు కలెక్ట్ చేయాలనేది శంకర్ టార్గెట్ గా కనిపిస్తుంది. మరి రోబో 2 ఏ రేంజ్ లో సక్సెస్ కొడుతుందో చూడాలి

English summary
Any number related to the ultimate biggie of the year 2.0 has to be unbelievable and here is one big example of that. The satellite rights of the movie have been snapped up for a mind-boggling 110 Cr.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu