twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిఖిల్ చెప్పింది నిజమైతే అద్బుతమే

    By Srikanya
    |

    హైదరాబాద్ : సినీ హీరో నిఖిల్ తాజాగా ట్విట్టర్ ద్వారా సినీ అభిమానులు ఆనందపరిచే వార్తను తెలియచేసారు. అది మరేదో కాదు... హైదరాబాద్ లో యూనివర్శల్ స్టూడియో కట్టబోతున్నారంటూ. ఆయన తాజా ట్వీట్ లో... "టాటా హెలి ప్లాంట్ మరియు యూనివర్సల్ స్టూడియోలపై కే.సి.ఆర్ నిర్ణయాలు ఆనందకరం" అన్నారు. నిజంగా అదే జరిగితే ఇంతకన్నా ఆనందం సినిమా అభిమానులుకు ఉండకుండా పోదు. ఎందుకంటే ఇక్కడకు హాలీవుడ్ కంపినీలు వలస వచ్చి...ఇక్కడ పెట్టుబడుల పెట్టడం ఖాయం.

    గతేడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన 'స్వామి రా రా'తో విజయాల బాట పట్టాడు నిఖిల్‌. ఇటీవల వైవిధ్యమైన కథల్ని ఎంచుకొంటూ ప్రయాణం చేస్తున్నాడు. నిఖిల్, స్వాతి ల కార్తికేయ సినిమా షూటింగ్ చివరిదశలో వుంది. ప్యాచ్ వర్కులతొ సహా ఈ సినిమా షూటింగ్ ను త్వరలో ముగించానున్నారు. ఈ చిత్రం ఆడియోని ఈ నెల 27న విడుదల చేయటానికి నిర్ణయించారు. ఆ రోజు నుంచే పబ్లిసిటీ క్యాంపైన్ సైతం మొదలుకానుంది. భారీగా ఈ క్యాంపైన్ ని చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. చందూ మొందేటి దర్శకుడిగా పరిచయంకానున్నాడు. మాగ్నమ్ సినిమా ప్రైమ్ బ్యానర్ పై వెంకట్ శ్రీనివాస్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

    Universal Studios in Hyderabad

    దేవాలయం నేపధ్యంలో వరుస మరణాల మిస్టరీ ని చేదించడానికి నిఖిల్ ఒక గ్రామానికి వెళ్తాడు. ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషలలో విడుదలకానుంది. నిఖిల్ సిద్ధార్ధ, స్వాతీ తమ గత చిత్రం 'స్వామి రారా' విజయంతో చాలా ఆనందంగా వున్నారు. మరోసారి ఆ మ్యాజిక్ ను తెరపై ప్రదర్శించాలని కోరుకుంటున్నారు.

    ఈ చిత్రం గురించి నిఖిల్ మాట్లాడుతూ.... ఇది ఎంటర్ టైన్మెంట్ బేస్ గా ఉంటుంది, ముఖ్యంగా సామర్లకోట దగ్గరలోని బెమ్మేశ్వరాలయం చుట్టూ జరిగే కథ ఇది. అన్ని కమర్షియల్ అంశాలు ఉన్న ఈ చిత్రం నాకు స్వామి రా రా తరువాత మంచి హిట్ ఇస్తుందన్న నమ్మకం ఉంది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ...పూర్తి వినోదాత్మకంగా సినిమా సాగుతుంది. వైజాగ్, అరకు, సామర్ల కోటలోని భీమేశ్వరాలయంలో షూటింగ్ చేసాం. గుడి నేపథ్యంలో సాగే కథ ఇది. అయితే హిస్టారికల్, పీరియాడికల్ మాత్రం కాదు అని తెలిపారు.

    ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో తనికెళ్ల భరణి, రావు రమేష్, శ్రీనివాస్ రెడ్డి, తులసి, కిషోర్, జోగి నాయుడు, తాగుబోతు రమేష్, పృథ్వి, గౌతం రాజు, శివన్నారాయణ, స్వామి రారా సత్య, గిరి తదితరులు నటిస్తున్నారు. కెమెరా : కార్తిక్, సంగీతం : శేఖర్ చంద్ర, ఎడిటింగ్ : కార్తిక శ్రీనివాస్, ఆర్ట్ : సాహి సురేష్, పాటలు : కృష్ణ చైతన్య, కొరియోగ్రఫీ : రఘు, ఫైట్స్ : వెంకట్ నాగు, సమర్పణ : శిరువూరి రాజేష్ వర్మ, నిర్మాత : వెంకట శ్రీనివాస్ బొగ్గరం, కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : చందు మొండేటి.

    English summary
    “Happy to knw our CM KCR Garu is taking Development up in a fast way.Tata’s Heli Plant nd new Universal Studios r gr8 “, Nikil tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X