గమ్మత్తైన పద్దతిలో శ్రీదేవికి రామ్ గోపాల్ వర్మ ఆహ్వానం..
శ్రీదేవి...ఈ రోజు(శుక్రవారం) రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం..అప్పలరాజు చిత్రం ఓపినింగ్ కి వస్తున్న సంగతి తెలిసిందే. ఈమె రాకను పురస్కరించుకుని వర్మ ఆమెకు వెలకమ్ చెప్పటానికి ఓ గమ్మత్తైన పద్దతిని అనుసరించారు. ఆమె తెలుగులో నటించిన సూపర్ హిట్ చిత్రాల పోస్టర్స్ కట్ అవుట్స్(వేటగాడు నుంచి గోవిందా గోవిందా వరకూ) ని వరసగా పెట్టిస్తున్నారు. ఆమెకు గతాన్ని గుర్తు చేయటాని ఈ హోర్డింగ్స్ స్ట్రాటజీని అమలుపరుస్తున్నారు. ఇవి చూసిన శ్రీదేవి మరి ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాల్సిందే. ఇక ఈ చిత్రంలో సునీల్ హీరోగా చేస్తున్నాడు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత రామ్ గోపాల్ వర్మ తెలుగులో చేస్తున్న స్టైయిట్ చిత్రమిది.
రామ్ గోపాల్ వర్మ శ్రీదేవి అప్పలరాజు వేటగాడు sridevi appala raju sunil govinda govinda ram gopal varma


Click it and Unblock the Notifications