»   » జిమ్ లో ఉపాసన వర్కౌట్లు: వీడియోలు పోస్ట్ చేసిన రామ్ చరణ్ భార్య

జిమ్ లో ఉపాసన వర్కౌట్లు: వీడియోలు పోస్ట్ చేసిన రామ్ చరణ్ భార్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎప్పుడూ మీడియాకు దూరంగా ఉండే ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ ఉండే ఉపాసన ర్పోయిన సంవత్సరం.. తన కొత్త వర్కవుట్స్ గురించి ఫేస్ బుక్‌లో పెట్టింది. న్యూయార్క్‌లో మార్నింగ్ వర్కవుట్స్ పేరుతో రెండు ఫోటోలు పోస్టు చేసింది.

శక్తికి, టోన్ అప్‌ కోసం ఈ వర్కవుట్స్ చేస్తున్నట్లు పేర్కొంది. ఇంకా ఈ వర్కవుట్స్ చేసేందుకు ఇషానీ రెడ్డి స్ఫూర్తే కారణమని తెలిపింది. ఆమెకు ప్రత్యేకంగా థ్యాంక్స్ కూడా చెప్పింది. ఇకపోతే.. ఇలాంటి వర్కవుట్స్ ద్వారానే ఉపాసన ముందులా బొద్దుగా కాకుండా కాస్త స్లిమ్ అయ్యింది కూడా ఆ తర్వాత ఉపాసన మళ్ళీ జిమ్ మాటెత్తలేదు కానీ మళ్ళీ తాజాగా తన వర్కౌట్ వీడియోలని పోస్ట్ చేసింది.

భర్త రామ్ చరణ్ మాదిరే తానుకూడా వర్కౌట్ల మీద శ్రద్ద పెట్టింది ఉపాసన. టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ఫిట్ నెస్ ఫ్రీక్ అన్న సంగతి తెలిసిందే. దేహ దారుఢ్యం కోసం చరణ్ చాలా కష్ట పడతాడు. చరణ్ భార్య ఉపాసన గతంలో ఫిట్ నెస్ గురించి ఎక్కువగా పట్టించుకునేది కాదు.

అయితే పోలో క్రీడ పట్ల మాత్రం ఆమె అమితాసక్తిని చూపించేది. తాజాగా ఆమె ఫిట్ నెస్ పై దృష్టి సారించింది. ఓ ఫిట్ నెస్ ట్రైనర్ ను ఏర్పాటు చేసుకుని, అతని సమక్షంలో వర్క్ ఔట్స్ చేస్తోంది. వర్క్ ఔట్స్ చేయడం అంత సులభం కాదని... ఈ 30 రోజుల కాలంలో ట్రైనర్ సహకారంతో ఏమేం చేయగలనో అన్నీ చేస్తానని చెప్పింది.

English summary
join me on a 30day Transformation diet,sleep,move,meditate. TOUGH but totally worth it!lets do this together TransformUrself Apollo_LStudio" Tweeted Upasana kamineni
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu