twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Upasana : రామ్ చరణ్ భార్యకు ప్రతిష్టాత్మక అవార్డు.. ఆ జోష్ లో ఉండగా మరో గుడ్ న్యూస్

    |

    ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె ఒక స్టార్ హీరో కోడలు, మరొక స్టార్ హీరో భార్య, అపోలో హాస్పిటల్ చైర్ పర్సన్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఉపాసన సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. తాజాగా ఉపాసన ఒక ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

    అండగా నిలుస్తూ

    అండగా నిలుస్తూ


    పెద్దింటి అమ్మాయి అయినా సోషల్ సర్వీస్ చేస్తూ నలుగురికి అండగా నిలుస్తూ ఉంటారు ఉపాసన. వ్యక్తిగతంగా ఎంతో బిజీగా ఉండే ఉపాసన స్ట్రీ పురుషులు సమానమే అని చెబుతూ ఉంటారు. ఆ మధ్య స్ట్రాంగ్ ఉమెన్ ను అబ్బాయిలు భరించలేరు అని చెబుతుంటారు కదా దానికి మీ సమాధానం ఏంటి ఒకరు ప్రశ్నించడంతో అందుకు ఉపాసన స్ట్రాంగ్ గా స్పందించింది.

    ప్రతిష్టాత్మక అవార్డు

    ప్రతిష్టాత్మక అవార్డు


    స్ట్రాంగ్ మెన్ ను ఒక ఉమెన్ భరించగలదా అని ప్రశ్నించగా అందుకు ఆమె మీరు భరిస్తున్నారు కదా అని సమాధానం చెప్పారు. తన దృష్టిలో జెండర్ పెద్ద విషయం కాదని చెబుతూ తన బెస్ట్ ఫ్రెండ్ ట్రాన్స్ జెండర్ అని అయితే ఆమె అన్ని విషయాలలో ఎంతో చురుగ్గా ఉంటుందని ఈ సందర్భంగా ఉపాసన వెల్లడించింది. అలా అన్ని విషయాల్లో చాలా బోల్డ్ గా ఉండే ఉపాసన తాజాగా ఒక ప్రతిష్టాత్మక అవార్డు అందుకుంది.

     రామ్ చరణ్ తో క్వాలిటీ టైం

    రామ్ చరణ్ తో క్వాలిటీ టైం


    సాధారణంగా ఉపాసన ఎప్పుడూ కూడా తన సెలబ్రిటీ హోదా సామాజిక సేవకు ఉపయోగించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే ఆమె అనేక రకాల కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. అంత చేస్తున్నా మరోపక్క తన భర్త రామ్ చరణ్ తో క్వాలిటీ టైం గడుపుతూ ఉంటారు. అంతేకాక ఆమె మన సొసైటీకే కాదు పర్యావరణ హితమైన కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటూ ఉంటారు.

     నాట్ హెల్త్ సీఎస్ఆర్ అవార్డు

    నాట్ హెల్త్ సీఎస్ఆర్ అవార్డు


    అందుకే హ్యూమన్ లైప్ తో పాటు వైల్డ్ లైఫ్ ను కాపాడాలి అనేది ఉపాసన ఆలోచన. ఈ దిశగా తన సేవలను అపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్ వైస్ చైర్ పర్సన్ గా కొనసాగిస్తున్న ఉపాసన కొణిదెలకు ప్రతిష్టాత్మక నాట్ హెల్త్ సీఎస్ఆర్ అవార్డు దక్కింది. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్ చేస్తున్న కృషికి గుర్తింపుగా 2022 ఏడాదికి గాను ఆమె ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.

    Recommended Video

    RRR లో మల్లి..ఎవరీ చిట్టితల్లి? Twinkle Sharma లైఫ్ మలుపు తిప్పిన యాడ్ | Filmibeat Telugu
     తెలుగు వారందరూ గర్వించే

    తెలుగు వారందరూ గర్వించే


    అయితే ఇలాంటి ఓ గొప్ప కార్యక్రమంలో తమల్ని భాగం చేసిన తాతయ్య అపోలో ఆస్పత్రుల ఫౌండర్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డికే ఈ అవార్డ్ ఘనత దక్కుతుందని ఉపాసన కొణిదెల ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. గ్రామీణాభివృద్ధిలో భాగంగా వైద్య సేవలు మెరుగుపరచాలి అని ఆయన లక్ష్యమే తనకు స్ఫూర్తినిచ్చింది అన ఆమె చెప్పారు. అయితే ఒకపక్క రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రతో దేశవ్యాప్తంగా సినీ ప్రియులను ఆకట్టుకుంటుండగా..సతీమణి ఉపాసన తన కెరీర్ లో భర్త మాత్రమే కాక తెలుగు వారందరూ గర్వించే పురస్కారాలు అందుకోవడం గమనార్హం.

    English summary
    upasana konidela has received the reputed NATHealth CSR Award 2022 for Total Health Initiative by Apollo Hospitals
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X