For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మరో మంచి పనితో వారికి అండగా నిలిస్తున్న మెగా కోడలు ఉపాసన.. గోల్డెన్ హార్ట్!

  |

  రామ్ చరణ్ సతీమణి ఉపాసన కేవలం మెగా కోడలు మాత్రమే కాదు. ఆమె భుజాన బరువైన బాధ్యతలు ఇంకా చాలానే ఉన్నాయి. వ్యాపారాలతో పాటు ఉపాసన పలు స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా అదే తరహాలో కొనసాగిస్తున్నారు. ఆమె మంచి మనసులో కూడా ఉన్నతమైన వ్యక్తిత్వం గల వారని చాలాసార్లు రుజువు చేసుకున్నారు. ఇక రీసెంట్ గా ఆమెకు సంబంధించిన మరొక మంచి విషయం గురించి కూడా తెలిసింది. ఆ వివరాల్లోకి వెళితే..

  స్వచ్చంధ సంస్థలకు..

  స్వచ్చంధ సంస్థలకు..

  టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్‌ భార్య ఉపాసన అతనిలో సగభాగం మాత్రమే కాదు. ఆమెలో ఒక మంచి నాయకత్వ లక్షణాలు, మంచితనం, పేదలకు సహాయం చేసే గుణం స్వచ్చంధ సంస్థలకు తోడ్పాటుగా నిలవడం.. ఇలా ఎన్నో విషయాల్లో ముందుంటారు. అపోలో ఫౌండేషన్ యొక్క కార్యకలాపాలను కూడా నిర్వహిస్తున్న ఉపాసన, నిరుపేదల కోసం చాలా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తోంది.

   బిలియన్ హార్ట్స్ బీటింగ్

  బిలియన్ హార్ట్స్ బీటింగ్

  ఉపాసన వ్యక్తిగతంగా చేసిన గొప్ప పనుల గురించి చాలామందికి తెలియదు. ఆమె గత కొంతకాలంగా బిలియన్ హార్ట్స్ బీటింగ్ (BHB) అనే మరో ఫౌండేషన్‌ ను కూడా కొనసాగిస్తున్నారు. ఆ సంస్థ ద్వారా ఉపాసన ఆమె భారతదేశం అంతటా 150 వృద్ధాశ్రమాలకు ఎంతగానో సహాయపడుతున్నారు. ఎలాంటి పరిస్థితులలో అయినా అండగా ఉంటామని కూడా ఆమె భరోసా ఇచ్చారు. ఇక కొంతమంది వృద్దలతో ఇటీవల ఉపాసన దిగిన కొన్ని ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  వారికి అండగా..

  వారికి అండగా..

  సొంతవారు దూరం చేయడంతో ఎటు వెళ్లలేని పరిస్థితులలో ఉన్న వృద్ధులక అండగా నిలబడాలనేది BHB యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఇక వారి ఆరోగ్యం విషయంలో కూడా ఈ స్వచ్చంధ సంస్థ ఇప్పటికే అనేక రకాల సహాయక కార్యక్రమాలు నిర్వహించారు. ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు.

  ఇతర రాష్ట్రాల్లో..

  ఇతర రాష్ట్రాల్లో..

  కరోనామహమ్మారి విజృంభించిన సమయంలో కూడా BHB సంస్థ ఇతర రాష్ట్రాల్లో ఉన్న వృద్ధాశ్రమాలకు అండగా నిలబడింది. తెలంగాణలోనే కాకుండా ఢిల్లీ/NCR, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న వృద్ధాశ్రమాలకు అలాగే పిల్లల గృహాలలో నెలవారీ మందులు, ఫేస్ మాస్క్‌లు, గ్లోవ్స్ శానిటైజర్‌లను ఉచితంగా పంపిణీ చేసింది. దాదాపు 4500 మంది వృద్ధులకు అలాగే 1900 మంది పిల్లలకు సహాయం చేశారు.

   మెగా ఫ్యామిలీతో..

  మెగా ఫ్యామిలీతో..

  ఇక ఈ పనులన్నీతో బిజీగా ఉంటూనే ఉపాసన మరొకవైపు తన భర్త రామ్ చరణ్ తో కూడా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఈ జంట మీడియాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటారు. ఇక రామ్ చరణ్ తో RRR సినిమా షూటింగ్ అనంతరం పలు విదేశాలకు వెళ్లి హాలిడేస్ ను ఎంజాయ్ చేసి వచ్చారు. ఇక రీసెంట్ గా ఉపాసన మెగా ఫ్యామిలీ తో కలిసి ప్రత్యేకంగా ఆచార్య సినిమాను కూడా వీక్షించడం జరిగింది. ఆదివారం రాత్రి AMB సినిమాస్ లో ఆచార్య స్పెషల్ షోను ప్రదర్శించగా అక్కడికి మెగా కుటుంబ సభ్యులు పలువురు హీరోలు కూడా రావడం జరిగింది. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఆచార్య సినిమాలో మెగాస్టార్, రామ్ చరణ్ నటించగా కొరటాల శివ దర్శకత్వం వహించారు.

  English summary
  Upasana konidela supports over 150 old age homes through the BHB Foundation
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X