»   » అటు వెంకటేష్, ఇటు నాగార్జున గానూ ఉపేంద్ర

అటు వెంకటేష్, ఇటు నాగార్జున గానూ ఉపేంద్ర

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు: కన్నడంలో చాలా కాలంగా తెలుగు రీమేక్ హవా నడుస్తోంది. సుదీప్, ఉపేంద్ర ఎక్కువ చేసేది తమిళ, తెలుగు రీమేక్ లే. తాజాగా ఉపేంద్ర రెండు తెలుగు సినిమాల రీమేక్ లలో చేస్తున్నాడు. అవి రెండు..సీనియర్ హీరోలు వెంకటేష్, నాగార్జున హిట్ సినిమాలు కావటం విశేషం.

ప్రస్తుతం సుదీప్‌తో కలసి వెంకటేష్ ,పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన "గోపాల గోపాల" రీమేక్ "ముకుందా మురారి"లో నటిస్తున్న ఉపేంద్ర. అందులో వెంకటేష్ చేసిన పాత్రను ఉపేంద్ర చేస్తూంటే, పవన్ పాత్రను సుదీప్ పోషిస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత "సోగ్గాడే చిన్నినాయన"లో నటించనున్నాడు. వచ్చే నెల నుంచి ఈ రీమేక్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కన్పిస్తున్నాయి.. నాగార్జున, రమ్యకృష్ణ చాలా కాలం తర్వాత కలిసి నటించిన మూవీ సోగ్గాడే చిన్ని నాయనా. సంక్రాంతి మూవీగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మంచి హిట్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ సినిమాను ఉపేంద్ర కన్నడలో రీమేక్ చేయనున్నారు.

Upendra and Prema in Nag’s SCN remake

కన్నడ రీమేక్‌లో ఉపేంద్ర ద్విపాత్రాభినయం చేస్తూండగా ఆయనకు జోడీగా నటి ప్రేమ జతకట్టనున్నారు. తెలుగులో రమ్యకృష్ణ పోషించిన పాత్రను కన్నడలో ప్రేమ చేయనున్నారు. సినిమాకు సంబంధించి పూర్తి పనులను ఉపేంద్ర స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా షూటింగ్ జులైలో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది.

'హెచ్.టు.ఓ' ఫేం లోకనాథ్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు 'మట్టె హుట్టి బా, ఇంటి ప్రేమ' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఒకప్పుడు "ఉపేంద్ర"తో కలసి చిత్రాల్లో నటించి... హిట్ పెయిర్ అనిపించుకున్న ఉపేంద్ర-ప్రేమ జంట ఇప్పుడు మరోసారి ఈ చిత్రంలో జోడీ కట్టనుంది. "సోగ్గాడే చిన్నినాయన"లో రమ్యకృష్ణ పోషించిన పాత్రను కన్నడలో ప్రేమ పోషించబోతోందట.

దాదాపు పదిహేడు సంవత్సరాల తర్వాత ప్రేమ, ఉపేంద్ర కలిసి నటించనున్నారనే వార్తతో ఉపేంద్ర అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జులై నుంచి షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రానికి తగిన మార్పులు,చేర్పులు,కూర్పులు అన్ని హీరో ఉపేంద్ర స్వయంగా చేస్తుండడడం విశేషం.

English summary
Upendra who is currently busy with Mukunda Murari has already signed up another movie titled Upendra Matte Hutti Baa – Inti Prema. The movie is a remake of Telugu hit ‘Soggade Chinna Nayana’ starring Nagarjuna.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu