Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆ టైటిల్ మార్చకుంటే ఉద్యమమే: హెచ్చరించిన బ్రాహ్మణ సంఘం
ఉపేంద్ర, సలోని, రాగిణి ద్వివేది హీరో హీరోయిన్లుగా 'బ్రాహ్మణ' చిత్రం రానుంది. శ్రీనివాస్ రాజు డైరెక్షన్ లో వచ్చిన కన్నడ చిత్రం 'శివం' ఘన విజయం సాధించింది. ఇదే సినిమాని ఇప్పుడు బ్రహ్మణ పేరుతో తెలుగులోకి డబ్ చేసారు. అయితే టైటిల్ "బ్రాహ్మణ" వెంటనే మార్చాలని, కులం పేరుతో సినిమాలు తీస్తే బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతింటాయని "బ్రాహ్మణ్స్ యూనిట్ ఫర్ ఎవర్ కో ఆర్డినేటర్స్" ఆలూరి, గోగులపాటి కృష్ణమోహన్, పిల్లుట్ల ఆనంద్ మోహన్ డిమాండ్ చేశారు.
బుధవారం ప్రాంతీయ సెన్సార్ బోర్డు అధికారి తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే బ్రాహ్మణులపై అనేక రకాలుగా దాడులు జరుగుతున్నాయని, దీనికి తోడు సినిమా టైటిళ్లకు కూడా ఆ పేర్లు పెట్టడం, సినిమాల్లో వేష, భాషలను అపహాస్యం చేస్తూ బ్రాహ్మణులను కించపరుస్తున్నట్లు వారు వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇక నుంచి బ్రాహ్మణులను కించపరిచే విధంగా సినిమాలు తీస్తే సహించేది లేదన్నారు.

నిజామా బాద్ లోని గాయత్రీ ధార్మిక వేదిక జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌శర్మ కూడా ఇదే డిమాండ్ని చేసారు. ఎల్లమ్మగుట్ట ఆంజనేయస్వామి ఆలయంలో అర్చక సమాఖ్య ప్రతినిధులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా శర్మ మాట్లాడారు.

నిత్యం దేవతారాధన, దీపారాధనలతో పాటు లోకకల్యాణార్థం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న బ్రాహ్మణులపై దాడులు జరపటమే కాకుందా సినిమాలకు పేర్లు పెట్టి తమను కించపరుస్తూ. బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీయొద్దన్నారు. సినిమా పేరు మార్చకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని కూడా వారు హెచ్చరించారు.