»   » పవన్ అత్తారింటికైతే...ఇతను స్విస్ బ్యాంకుకు (ఫోటోలు)

పవన్ అత్తారింటికైతే...ఇతను స్విస్ బ్యాంకుకు (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర టైటిల్ పాత్ర పోషించగా ఘన విజయం సాధించిన 'టోపీవాలా' చిత్రం 'స్విస్ బ్యాంక్‌కి దారేది' పేరుతో తెలుగులో అనువాదమవుతున్న విషయం తెలిసిందే. 'ది జర్నీ వాలా ఆఫ్ టోపీవాలా' అనే ట్యాగ్ లైన్‌తో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ మూవీస్' పతాకంపై గుంటూరుకు చెందిన ప్రముఖ స్తిరాస్థి వ్యాపారి రమేష్ బాబు అవులూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్.ఎన్.పగడాల సమర్పిస్తుంగా, ఆవులూరి అంకయ్యనాయుడు-దుర్గా ఎస్టేట్స్ పూర్ణ చంద్రరావు నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఇటీవల ఆడియో విడుదల జరుపుకున్న ఈచిత్రాన్ని ఈ నెలాఖరున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రమేష్ బాబు ఆవులూరి మాట్లాడుతూ..'ఉపేంద్ర స్టైల్‌లో ఆద్యంతం వినోదం పంచుతూనే ఆలోచింపజేసే వినూత్న కథా చిత్రం ఇది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసాం. ఈ నెలాఖరుకు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు.

ఉపేంద్రకు జంటగా 'మహాత్మ' ఫేం భావన నటించిన ఈ చిత్రంలో బొమ్మాళి రవిశంకర్ ముఖ్యపాత్రధారి. ఈ చిత్రానికి కథ-స్ర్కీన్ ప్లే చిత్ర కథానాయకుడు ఉపేంద్ర సమకూర్చడం విశేషం. కన్నడ చిత్ర పరిశ్రమలో 'మినిమం గ్యారంటీ డైరెక్టర్' అన్న పేరు తెచ్చుకుని 'మినిమం గ్యారంటీ'ని తన ఇంటి పేరుగా మార్చుకున్న యం.జి శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

పవన్ సినిమా టైటిల్ మాదిరి

పవన్ సినిమా టైటిల్ మాదిరి

ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా ‘అత్తారింటికి దారేది' చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ టైటిల్‌ను పోలిన విధంగా ఈ చిత్రానికి ‘స్విస్ బ్యాంక్‌కి దారేది' అనే టైటిల్ పెట్టడం గమనార్హం.

ఉపేంద్ర, భావన

ఉపేంద్ర, భావన

గతంలో ఉపేంద్ర నటించిన పలు చిత్రాలు తెలుగులో విడుదలై మంచి విజయం సాధించాయి. విలక్షణమైన నటన, సినిమాలతో తెలుగునాట కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఉపేంద్ర.

సినిమా ఎలా ఉంటుంది?

సినిమా ఎలా ఉంటుంది?

ఉపేంద్ర స్టైల్‌లో ఆద్యంతం వినోదం పంచుతూనే ఆలోచింపజేసే వినూత్న కథా చిత్రం ఇది.

ఇతర వివరాలు

ఇతర వివరాలు

ఈ చిత్రానికి మాటలు : హనుమయ్య బండారు, పాటలు : హనుమయ్య బండారు, చల్లా భాగ్యలక్ష్మి, శివమణి, సంగీతం: వి. హరికృష్ణ, నిర్వహణ: ఆవులూరి అకయ్యనాయుడు, పూర్ణచంద్రరావు, సమర్పణ: ఎస్.ఎన్. పగడాల, కథ-స్క్రీన్ ప్లే: ఉపేంద్ర, నిర్మాత: రమేష్ ఆవులూరి, దర్శకత్వం: మినిమం గ్యారంటీ శ్రీనివాస్.

English summary
Kannada star Upendra or Uppi as he's fondly called in Sandalwood is trying to cash in on the success of Pawan Kalyan's Atharintiki Daredi which is the recent industry hit in Telugu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu