»   »  హీరో గారి భార్య వేషాలకి రెడీ

హీరో గారి భార్య వేషాలకి రెడీ

Posted By:
Subscribe to Filmibeat Telugu
Upendra
A, ఉపేంద్ర ,రా, ఉష్ వంటి చిత్రాలతో తెలుగులోనూ తనకంటూ ప్రత్యేక మార్కెట్ యేర్పాటు చేసుకున్న కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర. అతను కొంత కాలం క్రితం ప్రియాంకా త్రిదేవి అనే కన్నడ హీరోయిన్ ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె హౌస్ వైఫ్ గా ఉంది. కానీ ఈ మధ్య కాజల్, ఐష్, సిమ్రాన్ వంటి హీరోయిన్లు పెళ్ళయినా నటిస్తూ అదరకొడుతూంటే చూస్తూ ఊరుకోలేకపోతోందిట. నిజానికామెకి యాక్టింగ్ చెయ్యాలని ఉన్నా ఇన్నాళ్ళూ ఉపేంద్ర కుటుంబ సభ్యుల కోరిక మేరకు గృహిణిలా ఇంటి పట్టున ఉండి భాద్యతలు నిర్వహించిందిట. ఇక ఇప్పుడు అవన్నీ ప్రక్కన పెట్టి సినీ ఫీల్డు లోకి దూకి తన పూర్వ వైభవం తెచ్చుకోవాలని ప్రయత్నిస్తోందిట. దాంతో ఆమె పాత పరిచయాలన్ని తిరగతోడటానికి షూటింగ్ లకు వెళ్తోంది. తెరపై అభ్యుదయ పాత్రలు వేసే ఉపేంద్ర అదే రీతిలో ఆమె మాటను గౌరవించి బెస్టాఫ్ లక్ చెప్పాడట. అక్క,చెల్లి పాత్రలకైనా రెడీ అంటూ దూకుతున్న ఆమెకు రెండు బెంగాళి సినిమా ఆఫర్స్ అప్పుడే వచ్చాయట.గ్రేట్ కదూ...

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X