»   » రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉంది. ఇప్పుడే కాదు

రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉంది. ఇప్పుడే కాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

శివమొగ్గ : రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉంది. ఇప్పుడే కాదు.. తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటానని సినీనటుడు సూపర్‌స్టార్‌ ఉపేంద్ర వెల్లడించారు. శివమొగ్గలో జేడీఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గీతా శివరాజ్‌కుమార్‌కు మద్ధతుగా ప్రచారం చేస్తున్న ఉపేంద్ర మీడియాతో మాట్లాడారు.

ఉపేంద్ర మాట్లాడుతూ... చిన్ననాటి నుంచి రాజకీయాలంటే మక్కువ. ఎప్పుడు ప్రవేశించాలో ఇంకా నిర్ణయించలేదు. బహుశా వచ్చే ఎన్నికల సమయంలో ప్రవేశం ఉండవచ్చు. తన రాజకీయ ప్రవేశం వినూత్నంగా ఉంటుంది. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ప్రస్తుతం తాను ఏఒక్క రాజకీయ పార్టీకి చెందినవాడిని కానని స్పష్టం చేశారు. శివరాజ్‌కుమార్‌ తనకు అత్యంత ఆత్మీయుడు. అందుకే ఆయన భార్య తరఫున ప్రచారంలో పాల్గొంటున్నా. మండ్యలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీలో ఉన్న రమ్య తరఫున ప్రచారం చేస్తానని తెలిపారు.

సమావేశంలో శివరాజ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రత్యర్థులు తమపై చేస్తున్న ఆరోపణల గురించి పట్టించుకోను. భార్యను గెలిపించడమే తనముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. త్వరలోనే నటులు రవిచంద్రన్‌, యోగీష్‌ తదితరులు శివమొగ్గలో ప్రచారానికి రానున్నారని చెప్పారు. నటి సంజన మాట్లాడుతూ తాను శివమొగ్గ నియోజకవర్గంలో మాత్రమే ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు.

Upendra will not contest elections

ఇక కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర టైటిల్ పాత్ర పోషించిన టోపీ వాలా సినిమా తెలుగు లోకి స్విస్ బ్యాంక్ కి దారేది పేరుతో తెలుగు లోకి అనువాదమవుతోంది. శ్రీ జర్నీవాలా ఆప్ టోపీవాలా అనే ట్యాగ్ లైన్ తో శ్రీ లక్ష్మీ చెన్న కేశవ మూవీస్ పతాకంపై గుంటూరుకు చెందిన రమేష్ అవులూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్. ఎస్. పగడాల సమర్పిస్తుండగా అవులూరి వెంకయ్య నాయుడు దుర్గా ఎస్టేట్స్ పూర్ణచంద్రరావు నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవలే ఆడియో విడుదల జరుపుకున్న ఈ చిత్రాన్ని నెలాఖరుకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

చిత్ర నిర్మాత రమేష్ బాబు అవులూరి మాట్లాడుతూ ఉపేంద్ర స్టయిల్ లో ఆద్యంతం వినోదం పంచుతూనే ఆలోచింప జేసే వినూత్న కథా చిత్రం స్విస్ బ్యాంక్ కి దారేది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెలాఖరుకు చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము అన్నారు.

ఉపేంద్రకు జంటగా మహాత్మ ఫేం భావన నటించిన ఈ చిత్రంలో బొమ్మాళి రవిశంకర్ ముఖ్య పాత్రధారి. ఈ చిత్రానికి కథ, స్ర్కీన్ ప్లే చిత్ర కథానాయకుడు ఉపేంద్ర సమకూర్చడం విశేషం. కన్నడ చిత్ర పరిశ్రమలో మినిమం గ్యారెంటీ డైరెక్టర్ అన్న పేరు తెచ్చుకుని మినిమం గ్యారెంటీని తన ఇంటి పేరుగా మార్చుకున్న యం.జి.శ్రీనివాస్ ఈచిత్రానికి దర్శకుడు అన్నారు. చిత్రానికి మాటలుః హనుమయ్య బండారు, పాటలుః హనుమయ్య బండారు, చల్లాభాగ్య లక్ష్మి -శివమణి, సంగీతం: వి.హరికృష్ణ.

English summary
Upendra in an interview with a regional television news channel said, "I have been approached by a few political parties to contest in the elections, but right now I am not prepared for it. I follow politics and whenever there is something happening, I discuss it with a few people. I just don't want be an MLA or MP for sake of it. If I do enter politics, I want to bring necessary changes."
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu