»   » కమల్ హాసన్ ‘ఉత్తమ విలన్’ రిలీజ్ డేట్ వచ్చేసింది

కమల్ హాసన్ ‘ఉత్తమ విలన్’ రిలీజ్ డేట్ వచ్చేసింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కమల్‌హాసన్ హీరోగా నటిస్తున్న ‘ఉత్తమ విలన్' విలన్ రిలీజ్ డేట్ ఖరారైంది. తెలుగు, తమిళం, హిందీలో విడుదల కానున్న ఈ చిత్రానికి. రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్, ఎన్ లింగుస్వామికి చెందిన తిరుపతి బ్రదర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. మార్చి 1న ఆడియో విడుదల చేసి, ఏప్రిల్ 2న సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కమల్ హాసన్ ఈ చిత్రంలో రంగస్థల కళాకారుడిగా, సినీ నటుడిగా రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ నటనకే పరిమితం కాకుండా...స్క్రిప్టు వర్క్, డైలాగ్స్ కూడా రాసారట. ఈ చిత్ర దర్శకుడు రమేష్ అరవింద్ ఈ విషయాలను తెలియజేసారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఉత్తమన్ అనే పాత్ర 8వ శతాబ్దానికి చెందిన డ్రామా యాక్టర్. మనోరంజన్ అనే పాత్ర 21 శతాబ్దానికి చెందిన సినిమా సూపర్ స్టార్ పాత్ర. ఈ రెండు పాత్రలను తనదైన రీతిలో కమల్ హాసన్ రక్తి కట్టించాడని యూనిట్ సభ్యులు అంటున్నారు. కమల్‌తో కలిసి దక్షిణాదికే చెందిన మరో నలుగురు అగ్ర హీరోలు కూడా ఇందులో కనిపించనున్నారని సమాచారం.

Uthama Villain Audio Release and Movie Release Date

ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్ని ఆస్కార్ అవార్డు గ్రహీత క్రైగ్ ఆధ్వర్యంలో అమెరికాలో జరుపుతున్నారు. ఈ చిత్ర గీతాల్ని మార్చి1న, సినిమాను ఏప్రిల్ 2 విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతల్లో ఒకరైన లింగుస్వామి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇటీవల మరణించిన ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ ఈ చిత్రంలో పాటు కె.విశ్వనాథ్, ఆండ్రియా, పూజాకుమార్, జయరాం ప్రధాన పాత్రల్లో నటించారు.

English summary
Uthama Villain Audio will be released on March 1st. The film will complete all the formalities and will release on April 2nd in Hindi, Telugu and Tamil languages.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu