»   » జూ ఎన్టీఆర్ సినిమాలో ఉత్తేజ్ కూతురు కూడా..?

జూ ఎన్టీఆర్ సినిమాలో ఉత్తేజ్ కూతురు కూడా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ నటుడు ఉత్తేజ్ కూతేరు చేతన త్వరలో ‘షీ' అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. పర్స రమేష్‌ మహేంద్ర దర్శకత్వంలో ఈ చిత్రం తెరెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఫిభ్రవరిలో సినిమాని పూర్తి చేసి, సమ్మర్లో షీ మూవీని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ సినిమాతో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించబోయే ‘జనత గ్యారేజ్'లోనూ చేతనని ఓ పాత్ర కోసం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉంటుంది? అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రిగా మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ ని ఎంపిక చేశార‌ు. ఈ సినిమాలో మ‌రో ముఖ్య‌మైన పాత్ర కోసం మ‌ల‌యాళ హీరో ఫ‌హ‌ద్ ఫాజిల్ ని తీసుకోనున్నార‌ని స‌మాచారం.

Uttej's Daughter Chetana in NTR's movie

ఈ మూవీ కోసం హైద్రాబాద్ సారధి స్టూడియోస్ లో భారీ సెట్ వేస్తున్నారు. ఎన్టీఆర్ వర్క్ చేయబోయే జనతా గ్యారేజ్ పేరుగల మెకానిక్ షెడ్ ని దాని చుట్టుపక్కలుండే ప్రాంతాలను సెట్ వేస్తున్నారు. ఇందుకోసం 2 వారాలకు పైగా సమయం పట్టనుందని తెలుస్తోంది. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ఇప్పటికే సెట్ నిర్మాణ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి - తిరు . ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వర రావు . ఆర్ట్ - ఎ. ఎస్. ప్రకాష్. సంగీతం - దేవీ శ్రీ ప్రసాద్ నిర్మాతలు - నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్ కథ - మాటలు - స్క్రీన్ ప్లే - దర్శకత్వం - కొరటాల శివ.

English summary
Uttej's Daughter Chetana play small roke in NTR's upcoming film Jabatha Garege.
Please Wait while comments are loading...