»   » కలెక్షన్స్ కేక, నాగార్జునకు లాభాలే లాభాలు!

కలెక్షన్స్ కేక, నాగార్జునకు లాభాలే లాభాలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని నాగార్జున నిర్మించి తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రం 'ఉయ్యాలా జంపాల' ఊహించని విధంగా సూపర్ హిట్ అయి లాభాల వర్షం కురిపిస్తోంది. డిసెంబర్ 25న విడుదలైన ఈచిత్రం తొలి వారం రూ. 6.25 కోట్లు వసూలు చేసింది. కేవలం కోటి రూపాయల‌లోపు బడ్జెట్‌తో ఈచిత్రం తెరకెక్కింది.

కలెక్షన్లపై ట్రేడ్ విశ్లేషకుడు త్రినాథ్ మాట్లాడుతూ...'కొత్త వారితో తీసిన ఉయ్యాల జంపాల చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం రూ. 6.25 కోట్లు వసూలు చేసింది. సంక్రాంతి ముందు విడుదల కావడం సినిమాకు బా ప్లస్సయింది' అని తెలిపారు.

మరో వైపు ఈ చిత్రానికి శాటిలైట్ రైట్స్ కూడా భారీగా పలికాయి. రూ. 1.5 కోట్లకు ఓ టీవీ ఛానల్ శాటిలైట్ రైట్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు సమర్పణలో సన్‌షైన్‌ సినిమాస్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకాలపై విరించివర్మ అనే నూతన దర్శకుడుని పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం 'ఉయ్యాలా జంపాలా'. ఈ చిత్రం ద్వారా రాజ్ తరుణ్, అవిక ('చిన్నారి పెళ్లికూతురు' ఫేమ్ ఆనంది) హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. సన్నీ ఎం.ఆర్. సంగీతం సమకూర్చారు.

ఇందులో నటించిన హీరోయిన్ 'చిన్నారి పెళ్లికూతురు' అనే టీవీ సీరియల్‌లో ఆనంది పాత్ర పోషించిన అవిక. ఈ సీరియల్‌కు మంచి ఆదరణ ఉండటంతో ఫ్యామిలీ ప్రేక్షకులు ఈచిత్రాన్ని చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: విశ్వ డి.బి., ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేశ్, కల: ఎస్.రవీందర్, సంగీతం: సన్నీ ఎం.ఆర్. నిర్మాతలు: నాగార్జున అక్కినేని, రామ్మోహన్ పి., దర్శకత్వం: విరించి వర్మ.

English summary

 Actor Akkineni Nagarjuna-produced Telugu romantic-drama "Uyyala Jampala", which released Dec 25, minted Rs. 6.25 crore in its first week in Andhra Pradesh, thus being declared a hit by trade pundits.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu