»   » నాగార్జున మూవీకి...బడ్జెట్‌కు డబుల్ శాటిలైట్ రైట్స్

నాగార్జున మూవీకి...బడ్జెట్‌కు డబుల్ శాటిలైట్ రైట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరో నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియోస్, సన్ షైన్ సినిమాస్ సంయుక్తంగా నర్మించిన 'ఉయ్యాల జంపాల' చిత్రం ఈ రోజు విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ భారీగా అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. కేవలం రూ. 80 లక్షల బడ్జెట్‌తో నిర్మించిన ఈచిత్రం శాటిలైట్ రైట్స్ రూ. 1.5 కోట్ల పలికినట్లు సమాచారం.

Uyyala Jampala

ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు సమర్పణలో సన్‌షైన్‌ సినిమాస్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకాలపై విరించివర్మ అనే నూతన దర్శకుడుని పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం 'ఉయ్యాలా జంపాలా'. ఈ చిత్రం ద్వారా రాజ్ తరుణ్, అవిక ('చిన్నారి పెళ్లికూతురు' ఫేమ్ ఆనంది) హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. సన్నీ ఎం.ఆర్. సంగీతం సమకూర్చారు.

ఈ చిత్రానికి శాటిలైట్ రైట్స్ ఈ రేంజిలో రావడానికి కారణం.....ఇందులో నటించిన హీరోయిన్ 'చిన్నారి పెళ్లికూతురు' అనే టీవీ సీరియల్‌లో ఆనంది పాత్ర పోషించిన అవిక. ఈ సీరియల్‌కు మంచి ఆదరణ ఉండటంతో ఫ్యామిలీ ప్రేక్షకుల నుంచి ఈచిత్రానికి బుల్లి తెరపై మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు.

ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: విశ్వ డి.బి., ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేశ్, కల: ఎస్.రవీందర్, సంగీతం: సన్నీ ఎం.ఆర్. నిర్మాతలు: నాగార్జున అక్కినేని, రామ్మోహన్ పి., దర్శకత్వం: విరించి వర్మ.

English summary
‘Uyyala Jampala’ satellite rights fetches double to budget. The movie was produced by Annapurna and Suresh Productions with a budget of just Rs.80Lakhs.The latest we heard is the film’s satellite rights gave them double the investments. Sources say that the movie has fetched a satellite rights price of Rs.1.5 crores.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu