»   » రోమాలు నిక్కపొడుచుకునేలా: చిరు 151 "సై...రా" మోషన్ పోస్టర్

రోమాలు నిక్కపొడుచుకునేలా: చిరు 151 "సై...రా" మోషన్ పోస్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

1978లో పునాదిరాళ్లు సినిమాతో మొదలైన సినిమా ప్రస్థానం ఖైది నంబర్ 150 దాకా కొనసాగుతూనే ఉంది.చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదు తన మొదటి రిలీజ్ అయిన సినిమాగా పరిగణలోకి తీసుకుంటారు. తెలుగు సినిమా స్థాయిని పెంచిన హీరో అంటే అది తప్పకుండా మెగాస్టార్ చిరంజీవి అని చెప్పొచ్చు. టాలీవుడ్ ని ఏలిన అతితక్కువమంది హీరోల్లో తొలితరం కథానాయకుల తర్వాత ఇప్పటివరకూ మళ్ళీ అంతటి క్రేజ్ ఉన్న హీరో మెగాస్టార్ ఒక్కడే .

 సైరా

సైరా

చిరు స్టామినా ఏమిటో పదేళ్ల తర్వాత కూడా ప్రూవ్ చేసింది ఖైది నంబర్ 150 మూవీ.ఇక తన 151వ సినిమాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ తో వస్తున్నాడు చిరంజీవి. ఆ సినిమా టైటిల్ గా సైరా అని పెట్టారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కనున్న తాజా చిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.


ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

సురేందర్‌రెడ్డి దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. పద్దెమినిదవ శతాబ్దానికి చెందిన స్వాతంత్య్ర సమరసేనాని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరోచిత పోరాటానికి దృశ్యరూపంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. వివిధ భారతీయ భాషల్లో ఈ చిత్రాన్ని అనువాదం రూపంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


 నరసింహారెడ్డి ఉపశీర్షికగా

నరసింహారెడ్డి ఉపశీర్షికగా

ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకొని నేడు ప్రకటించారు. సై...రా నరసింహారెడ్డి అనే టైటిల్‌ ప్రధాన టైటిల్ కాగా..నరసింహారెడ్డి ఉపశీర్షికగా ఉంది. దాదాపు 150కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.


యూనివర్సల్ అపీల్ కోసం

యూనివర్సల్ అపీల్ కోసం

ముందుగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే టైటిల్ నే పెట్టాలని నిర్ణయించినా.. తరువాత యూనివర్సల్ అపీల్ కోసం టైటిల్ ను మార్చాలని నిర్ణయించారు. ఒకేసారి తెలుగు తమిళ హిందీ మలయాళ భాషల్లో రిలీజ్ కు ప్లాన్ చేస్తుండటంతో అందుకు తగ్గట్టుగా మహావీర అనే టైటిల్ ను ఫిక్స్ చేశారన్న ప్రచారం జరిగింది.
సై రా నరసింహారెడ్డి

అయితే తాజాగా మరో ఇంట్రస్టింగ్ టైటిల్ తెర మీదకు వచ్చింది. రాయలసీమ ప్రాంతంలో ఉయ్యాలవాడ సాహసాలను కీర్తిస్తూ పాడుకునే 'సై రా నరసింహారెడ్డి' అనే పదాలనే సినిమా టైటిల్ గా నిర్ణయించారట. మొత్తానికి ఆకట్టుకునే టైటిల్ అనే చెప్పొచ్చు, అటు హిందీలోనూ ఇటు తెలుగులోనూ ఒకేలా ఉండే టైటిల్ కోసం వెతుకుతున్నారన్నారు. మరి ఇదే టైటిల్ హిందీలో ఉంటుందా లేక మహావీర ని హిందీలో పెడతారా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.English summary
chiranjeevi upcoming film is uyyalawada narasimha reddy tittled as saira
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu