»   » నా భార్యను చూసారా? పర్సనల్ విషయాలొద్దు....తెలుగు దర్శకుడి ఫైర్!

నా భార్యను చూసారా? పర్సనల్ విషయాలొద్దు....తెలుగు దర్శకుడి ఫైర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'మనసంతా నువ్వే' ద్వారా తొలి సినిమాతోనే సంచలన విజయం తన ఖాతాలో వేసుకుని వరుస అవకాశాలతో బిజీ అయిపోయిన దర్శకుడు వి.ఎన్.ఆదిత్య. అయితే తర్వాత చాలా అవాకశాలు వచ్చినా హిట్స్ లేక పోవడంతో ఫేడౌట్ అయిపోయాడు. ఈ మధ్య అసలు విఎన్.ఆదిత్య సినిమాలు చేసిన దాఖలాలు కూడా లేవు.

తన సినిమాల సంగతి పక్కన పెడితే పలు వివాదాలతో కూడా వి.ఎన్.ఆదిత్య అప్పట్లో వార్తల్లో నిలిచాడు. ఓ ఫేమస్ సెలబ్రిటీతో అతడికి ఎఫైర్ ఉందని, ఆ కారణంగానే అతడి కాపురంలో కలతలు వచ్చాయంటూ అప్పట్లో ప్రచారం జరిగింది.

తన సినిమాలు, వివాదాలు ఇలా పలు అంశాలపై విఎన్.ఆదిత్య తాజాగా టీఎన్ఆర్ ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు.

ఆ సినిమాకు డైరెక్టర్ నేను కాదు, హరీష్ శంకర్

ఆ సినిమాకు డైరెక్టర్ నేను కాదు, హరీష్ శంకర్

విఎన్ ఆదిత్య దర్శకత్వంలో ఎంఎస్ రాజు నిర్మాతగా తెరకెక్కిన చిత్రం ‘ఆట'. ఈ సినిమా అప్పట్లో గుడుంబా శంకర్ చిత్రాన్ని ఉన్నది ఉన్నట్లు దించారనే విమర్శలు వచ్చాయి. దీనిపై వి. ఎన్. ఆదిత్య వివరణ ఇస్తూ... వాస్తవానికి ‘ఆట' సినిమాకు దర్శకుడిని నేను కాదు హరీష్ శంకర్. బొమ్మరిల్లు తర్వాత సిద్ధార్థ్, మమతా మోహన్ దాస్ జంటగా ఈ సినిమాను ఎంఎస్ రాజు అనౌన్స్ చేసారు. అపుడు నేను నాగార్జునతో ‘బాస్' ఫినిషింగ్ షెడ్యూల్ లో ఉన్నాను. ఉన్నట్టుండి ఎంఎస్ రాజు గారు ఫోన్ చేసి రేపు ముహూర్తం...నువ్వే సినిమా డైరెక్ట్ చేయాలి అని చెప్పారు. తప్పని పరిస్థితుల్లో ఆ సినిమా చేసానని విఎన్ ఆదిత్య తెలిపారు.

హీరోయిన్ అంకితపై మోజు?

హీరోయిన్ అంకితపై మోజు?

విఎన్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన మనసు మాట వినదు సినిమాలో అంకిత హీరోయిన్. అంకితపై మీరు మోజు పడ్డారట అనే అంశంపై విఎన్.ఆదిత్య స్పందిస్తూ... అలాంటిదేమీ లేదని, తనకు అప్పుడే పెళ్లి కూడా అయిందని విఎన్ ఆదిత్య తెలిపారు.

నేను కొందరికి మధ్యలో బ్రిడ్జిలా ఉండే వాడిని

నేను కొందరికి మధ్యలో బ్రిడ్జిలా ఉండే వాడిని

ఈ ఇంటర్వ్యూలో ఓ ప్రశ్నకు విఎన్.ఆదిత్య స్పందిస్తూ.... నేను కొందరి మధ్య బ్రిడ్జిలా ఉండే వాడిని అని వ్యాఖ్యానించారు. వారి పేర్లు చెప్పడానికి మాత్రం ఆయన నిరాకరించారు. ఇండస్ట్రీలో జరిగే కొన్ని ఎఫైర్స్ విషయంలోనే ఆయన ఈ కామెంట్ చేసారని తెలుస్తోంది.

పర్సనల్ విషయాలొద్దు అంటూ ఫైర్

పర్సనల్ విషయాలొద్దు అంటూ ఫైర్

ఇండస్ట్రీలో ఉన్న ఫేమస్ సెలబ్రిటీతో అఫైర్ ఉందని, ఆ కారణంగా విఎన్ ఆదిత్య ఫ్యామిలీ చిచ్చు రేగిందని, వాళ్ల ఆవిడ ఆయనతో ఉండటం లేదు స్కూలు టీచర్ గా పని చేస్తోందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అప్పట్లో ఈ వార్తలు రాసిన వారిపై వి.ఎన్.ఆదిత్య ఫైర్ అయ్యాడు. అలా రాసిన వాడెప్పుడైనా నా ఫ్యామిలీని రోడ్డు మీద చూసాడా? నా పెళ్లి పోటోలు తప్ప ఎవరైనా ఇంకో ఫోటో చూసారా? నా మిసెస్ ను ఎవరైనా చూసారా? సినిమా సెలబ్రిటీల మీద ఒక లెవల్ వరకు గాసిపింగ్ ఓకే. అంతకు మించి వ్యక్తిగత విషయాలపై రూమర్స్ రాస్తే ఊరుకోను అంటూ విఎన్.ఆదిత్య ఫైర్ అయ్యాడు.

వివాదాస్పద వ్యాఖ్యలు

వివాదాస్పద వ్యాఖ్యలు

ఇటీవల యూఎస్ లో ఉన్నపుడు విఎన్.ఆదిత్య వివాదాస్పద కామెంట్స్ చేసారు. సినిమా ప్రమోషన్స్ కోసం కవర్లో డబ్బులు తీసుకునే వారికి కళాకారుడి జీవితం, విలువ ఏం తెలుసు? అంటూ కామెంట్ చేసారు. తానే స్వయంగా అనేక సార్లు కవర్లు ఇచ్చానని... తాను చేసిన కామెంటుకు కట్టుబడి ఉంటానని విఎన్. ఆదిత్య స్పష్టం చేసారు. విఎన్.ఆదిత్యకు సంబంధించిన పూర్తి ఇంటర్వ్యూ ఈ నెల 14న యూట్యూబ్ లో రిలీజ్ కాబోతోంది.

English summary
V. N. Aditya sensational comments on media. V. N. Aditya is an Indian film director and screen writer known for his works in Telugu cinema.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu