»   » చిరంజీవి 150వ సినిమా షూటింగ్ వివరాలు వెల్లడించిన వినాయక్

చిరంజీవి 150వ సినిమా షూటింగ్ వివరాలు వెల్లడించిన వినాయక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటించే 150వ సినిమా వివి వినాయక్ దర్శకత్వంలో రాబోతున్న సంగతి తెలిసిందే. తమిళంలో హిట్టయిన ‘కత్తి' చిత్రాన్ని తెలుగులో చిరంజీవి 150వ సినిమాగా రీమేక్ చేస్తున్నారు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా స్క్రిప్టులో మార్పులు చేసే పనిలో బిజీగా ఉన్నారు వినాయక్.

తొలిసారిగా వివి వినాయక్ ఈ సినిమా గురించి నోరు విప్పారు. మార్చి లేదా ఏప్రిల్ లో సినిమా తొలి షెడ్యూల్ మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం స్క్రిప్టుకు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే రామ్ చరణ్ బర్త్ డే మార్చి 27న సినిమా లాంచనంగా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

V V Vinayak Reveals About Chiranjeevi 150 Shooting Details

ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మాణగా కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లొ తెరకెక్కించనున్నారు. తమిళ వెర్షన్ కత్తి చిత్రాన్ని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ సంస్థ కూడా చిరంజీవితో చేస్తున్ తెలుగు వెర్షన్ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతోంది.

ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన ఎవరు నటిస్తారు? అనేది చాలా కాలంగా హాట్ టాపిక్. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నయనతార హీరోయిన్ గా ఖరారైనట్లు సమాచారం. ఆమె అయితేనే చిరంజీవికి పర్ ఫెక్టుగా సెట్టవుతుందని భావిస్తున్నారట. ఫ్యాన్స్ కూడా నయనతార ఎంపికపై సంతృప్తిగానే ఉన్నారు.

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే...ఈ సినిమాకు చిరంజీవి తీసుకునే రెమ్యూనరేషన్ కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం. రామ్ చరణ్, లైకా ప్రొడక్షన్స్ వారు ఈ విషయమై చర్చించి రూ. 30 కోట్లు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ రూ. 15 కోట్ల అడ్వాన్స్ కూడా ఇచ్చారట. అయితే ఈ విషయమై అఫీషియల్ సమాచారం ఏమీ లేదు.

English summary
Chiranjeevi 150, the film that has been in the pre-production stage since years is finally moving towards going on sets. But late than never. V V Vinayak opened up about the film's progress and promised that the film will start its first schedule by March or April.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu