»   » వివి వినాయక్‌పైనే భారం, భారీగా ఖర్చు, ఆడియో ఖరారు!

వివి వినాయక్‌పైనే భారం, భారీగా ఖర్చు, ఆడియో ఖరారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వివి వినాయక్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు శ్రీను అనే టైటిల్ ఖరారు చేసారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్ర ఆడియో వేడుకను ఈ నెల 29న ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

తన కొడుకు హీరోగా పరిచయం అవుతున్న సినిమా కావడంతో ఈ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించేందుకు బెల్లంకొండ సురేష్ ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళ సినీ రంగాల్లోని ప్రముఖులను ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. మరో వైపు ఈచిత్రానికి ఖర్చు చేస్తున్న బడ్జెట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

V.V.Vinayak’s new audio launch date confirmed

సాధారణంగా కొత్త హీరోల సినిమాలంటే వీలైనంత వరకు బడ్జెట్ తక్కువగానే ఉండేట్టు చూసుకుంటారు దర్శక నిర్మాతలు. కొత్త మొహాలు కాబట్టి వసూళ్లు తక్కువగా ఉంటాయనే లెక్కులు వేసి బడ్జెట్ కుదిస్తారు. అయితే వివి వినాయక్ దర్శకత్వం, సమంత హీరోయిన్‌గా చేస్తుండటం, తమన్నాతో ఐటం సాంగు లాంటి అట్రాక్షన్స్ ఉండటం వల్ల సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా మళ్లీ రాబట్టుకోవచ్చనే ఆలోచనలో ఉన్నాడట బెల్లంకొండ. ఈ చిత్రానికి దాదాపు 35 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

భారీ విజయం సాధిస్తే తప్ప స్టార్ హీరోల సినిమాలకి 40 కోట్లు వసూలు కావడమే గగనంగా ఉన్న ఈ రోజుల్లో తన కొడుకు తొలి సినిమాకు బెల్లంకొండ ఇంత ఖర్చు పెడుతుండటం చర్చనీయాంశం అయింది. అదృష్టం కలిసొచ్చి కొడుకు హీరోగా క్లిక్ అయితే.....భవిష్యత్‌లో తన వారసుడితోనే సినిమాలు తీసుకోవచ్చని, అపుడు లాభాలు మరింత ఎక్కువగా ఉంటాయని బెల్లంకొండ భావిస్తున్నాడట. రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. శ్రీ లక్ష్మి నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 4గా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రానికి వినాయక్ అత్యంత ఎక్కువ మొత్తంలో రూ. 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్ల సమాచారం. అదే విధంగా తన కొడుకు సరసన సమంతను హీరోయిన్ గా ఒప్పించడానికి కూడా ఆమెకు భారీ మొత్తంలోనే ఆఫర్ చేసాడట బెల్లంకొండ.

English summary

 V.V.Vinayak’s latest movie “Alludu Seenu”. Bellamkonda Suresh’s son Sreenivas has been introduced as hero. Samantha is heroine. Recently, song’s release date has been confirmed which is on 29th of this month.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu