నీళ్లు కాదు, నిప్పులు తాగుతూ సప్తగిరి.. (‘వజ్ర కవచధర గోవింద’ టీజర్)
స్టార్ కమెడియన్ సప్తగిరి హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'వజ్ర కవచధర గోవింద'. అరుణ్ పవార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో గోవిందు అనే ఫన్నీ దొంగ పాత్రలో సప్తగిరి కనిపించబోతున్నారు. ఇటీవల ఫస్ట్ లుక్ విడుదలచేసిన చిత్ర బృందం తాజాగా టీజర్ వదిలారు.
''నేను ఓ వలస పక్షిని.. నాకంటూ ఒక గమ్యం లేదు. నన్ను వెతుక్కుంటూ నలుగురొచ్చారు.. స్నేహితులన్నారు, ఓ అందమైన అమ్మాయి వచ్చింది.. ప్రియురాలంది. నేనెప్పుడూ వినని, వెళ్లని చోటు నుంచి గుంపులుగా వందల మంది వచ్చారు.. శత్రువులన్నారు. ఇక మేక పులి ఆట మొదలైంది. నా ధైర్యం.. ఆయుధం, నా సంకల్ప బలం'' అంటూ సప్తగిరి చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.

ఓ సీన్లో... సప్తగిరి కత్తి పదును పెడుతుండగా వస్తున్న నిప్పు రవ్వలను సేవిస్తూ కనిపించడం టీజర్లో హైలెట్ అయంది. ఈ సినిమాను శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.
వైభవీ జోషీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అర్చనా వేద, టెంపర్ వంశీ, అప్పారావు, అవినాష్, రాజేంద్ర జాన్ కొట్టోలి, వీరేన్ తంబిదొరై తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: జి టి ఆర్ మహేంద్ర, సంగీతం: విజయ్ బుల్గానిన్, కెమెరా: ప్రవీణ్ వనమాలి, ఎడిటింగ్: కిషోర్ మద్దాలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సలాన బాలగోపాలరావు, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: అరుణ్ పవార్.


Click it and Unblock the Notifications











