»   » రైటర్ ని దర్శకుడుగా మార్చి ఛాన్స్ ఇస్తున్న ఎన్టీఆర్

రైటర్ ని దర్శకుడుగా మార్చి ఛాన్స్ ఇస్తున్న ఎన్టీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎన్టీఆర్ ఇప్పుడు ఓ రైటర్ కి దర్శకుడుగా ప్రమోషన్ ఇస్తున్నారు. తనకు అశోక్,ఊసరవెల్లి చిత్రాల కథలు రాసిన వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. రీసెంట్ గా ఎన్టీఆర్ ని కలిసిన వంశీ..పూర్తి స్క్రిప్టు నేరేట్ చేసాడని, అది విన్న ఎన్టీఆర్ వెంటనే ఓకే చేసేసాడని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుని ఎన్టీఆర్ తో గతంలో ఓ పెద్ద హిట్ ఇచ్చిన సంస్ధ నిర్మించనుంది. అయితే చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది మాత్రం తెలియరాలేదు.

ఇన్నాళ్లుగా వక్కతం వంశీ కథలుని సురేంద్ర రెడ్డి దర్శకత్వం చేస్తూ వచ్చారు. సురేంద్రరెడ్డితో అశోక్ నుంచి వంశీ జర్నీ సాగుతోంది. రీసెంట్ గా అల్లు అర్జున్ తో చేయబోయే చిత్రానకి సైతం వక్కంతం వంశీనే కథ ఇస్తున్నారు. వంశీ దర్శకుడుగా మారితే సురేంద్రరెడ్డి మరో రైటర్ ని వెతుక్కోవాల్సిందే. గతంలో త్రివిక్రమ్, విజయ్ భాస్కర్ జంట ఇలాగే వరస హిట్స్ తో దూసుకుపోయారు. ఎప్పుడయితే త్రివిక్రమ్ దర్శకుడుగా మారారో అప్పుడే విజయ్ భాస్కర్ హవాకి బ్రేక్ పడింది. అలాంటి పరిస్ధితి రాకుండా సురేంద్రరెడ్డి చూసుకోవాలి.

ఇక ఎన్టీఆర్ వరస ప్రాజెక్టులు కమిటవుతున్నారు. బాద్షా షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని హరీష్ శంకర్ తో చేస్తున్నారు. ఆ చిత్రం తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నారని సమాచారం. ఆ రెండు చిత్రాల తర్వాత వక్కంతం వంశీ చిత్రం ప్రారంభం అవుతుంది. వక్కతం వంశీతో ఎన్టీఆర్ కి టీవి సీరియల్స్ టైమ్ నుంచీ మంచి అనుభందం ఉంది. వక్కతం వంశీ..కిది ఇది మంచి అవకాసం. ఓ స్టార్ డైరక్టర్ తో హిట్ కొడితే ఇండస్ట్రీలో టాప్ దర్శకుల లిస్ట్ లో చేరుతారు.

English summary
Vakkantam Vamsi and who wrote stories for Jr NTR's Ashok and Oosaravelli. Though the stories of both these films got some punch, the films bombed at Box Office. However, this writer has impressed NTR with his skills and convinced Young Tiger with another new story now. Surprisingly, he wants to turn director with this flick and is in the process of making NTR accept his proposal.
Please Wait while comments are loading...