»   » వంశీ, అల్లరి నరేష్ చిత్రం టైటిల్ ఏమిటంటే...

వంశీ, అల్లరి నరేష్ చిత్రం టైటిల్ ఏమిటంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ దర్శకుడు వంశీ దర్శకత్వంలో అల్లరి నరేష్ చేయనున్న చిత్రానికి 'సరదాగా కాసేపు' అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. ఇంతకుముందు అల్లరి నరేష్ తో లేడీస్ టైలర్ సీక్వెల్ వంశీ చేయనున్నారని వినిపించింది. అయితే ఇప్పుడా కథ కాకుండా వేరే కథలో ఆయన రానున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం అల్లరి నరేష్ మరో ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాధ్ దర్శకత్వంలో రానున్న సుమధురం చిత్రంలో చేస్తున్నారు. మార్చి 16 వరకూ సెకెండ్ షెడ్యుల్ కేరలలో జరగనుంది. మంజరి ఫెర్నాండెస్ ఈ చిత్రంలో నరేష్ కి జోడీగా చేస్తోంది. అలాగే ఈ చిత్రం అనంతరం ముళ్ళపూడి వీరభద్ర చౌదరిని దర్శకుడుగా పరిచయం చేస్తూ రూపొందనున్న చిత్రం ప్రారంభమవుతుంది. నమో వెంకటేశ, బిందాస్ చిత్రాలు నిర్మించిన అనీల్ సుంకర ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ రెండు చిత్రాల తర్వాత వంశీ చిత్రం అనంతరం...రాజ్ పిప్పళ్ళ దర్శకత్వంలో అల్లరి నరేష్ చేసే చిత్రం మొదలవుతోంది. ఈ మధ్య కాలంలో ఇంత బిజీగా వరస సినిమాలుచేస్తున్న హీరోలు రవితేజ, నరేష్ కావటం విశేషం.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu