యంగ్ హీరోలకు గట్టిపోటీ ఇస్తున్న నాగార్జునకో బృందావనం...!?

By Sindhu

హీరోగా ఎంట్రీ ఇచ్చి 25సంత్సరాలు దాటినా హీరోగా ఇప్పటికీ బిజీగానే వుంటూ యంగ్ హీరోలకు గట్టిపోటీ ఇస్తున్నాడు నాగార్జున. బాలకృష్ణ, వెంకటేష్ లతో కంపేర్ చేస్తే ఈ మధ్యకాలంలో నాగార్జునే ఎక్కువ సినిమాలు చేశాడు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు, చేయబోతున్న సినిమాలు కూడా ఎక్కువే వున్నాయి. రాజన్న, ఢమురుకం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటూ వుండగా శిరిడీసాయి ప్రారంభం కావాల్సి వుంది. అలాగే ఆది శంకరాచార్య చిత్రంలో ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాడు నాగార్జున.

ఇవి కాకుండా బృందావనం డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో నాగ్ ఓ సినిమా చేయబోతున్నట్టు తెలిసింది. డి శివప్రసాద్ రెడ్డి నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే ప్రారంభమవుతుందని తెలుస్తోంది. వంశీ ఇప్పటికే రామ్ చరణ్ తో ఓ సినిమా కమిట్ అయ్యాడు. 'రచ్చ" తర్వాత రామ్ చరణ్ వంశీ డైరెక్షన్ లో సినిమా చేస్తాడు. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత నాగార్జున, వంశీ కాంబినేషన్ లో మూవీ స్టార్ట్ అవుతుందని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X