కాళోజి అవార్డు అందుకున్న చంద్రబోస్, వందేమాతరం శ్రీనివాస్
కాళోజీ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. 2016 సంవత్సరానికి గాను చంద్రబోస్ అవార్డు అందుకున్నారు.
Recommended Video

Kaloji Narayana Rao Awards : Chandrabose felicitated With Kaloji Award
మహకవి, ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజి నారాయణ రావు జయంతి సందర్భంగా గత 5 సంవత్సరాల నుండి భారత్ కల్చరల్ అకాడమీ, తెలుగు టెలివిజన్ రచయితల సంఘం సంయుక్తంగా పురస్కారం అందిస్తున్నారు.
గతంలో గూడ అంజయ్య, సుద్దాల అశోక్ తేజ, జె కె భారవిలు ఈ పురస్కారం అందుకున్నారు. తాజాగా 2016 కు సినీ రచయిత చంద్ర బోస్‌కు , 2017 కు ప్రజా గాయకుడు, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌లకు అవార్డు ప్రధానం చేశారు.

సెప్టెంబర్ 18న హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ హాల్ లో కాళోజి పురస్కార ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి నాగ బాల సురేష్ కుమార్ అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథి గా తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు కె వి రమణ చారి, అతిధులుగా నిర్మాత సాయి వెంకట్, నిర్మాత ఆమ్రేష్ కుమార్ పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











