»   » అది వందేమాతరం శ్రీనివాస్ చేసిన బద్మాష్ పని...

అది వందేమాతరం శ్రీనివాస్ చేసిన బద్మాష్ పని...

Posted By:
Subscribe to Filmibeat Telugu

సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ తొలిసారిగా దర్శకత్వం వహిస్తూ చేసిన చిత్రం బద్మాష్. టైటిల్ కి తగ్గట్లే సినిమాకూడా అదే రేంజిలో ఉండటం ఈ చిత్రం ప్రత్యేకత. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ కాలేజీ యాజమాన్యం నిర్మించిన ఈ చిత్రం కథ...కాలేజీలో ఉండాల్సిన విలువలు, నైతిక విలువలనే అస్దికతనే ప్రశ్నిస్తూ సాగుతుంది. ఈ కథలో ఓ స్ట్రిక్టు కార్పోరేట్ కాలేజీ...ప్రిన్సిపాల్. ర్యాగింగ్ లాంటివి కనపడని ఆ కాలేజీలో పిల్లలు ఏమిటీ శిక్ష(?) అని ఫీలవుతూంటారు. అప్పుడు అక్కడ అనేక కాలేజీల్లో టీసీ ఇప్పించుకుని వెళ్ళగొట్టబడ్డ హీరో (నాగసిద్దార్ధ్) వచ్చి జాయిన్ అవుతాడు. ఎలాగయినా ఆ కాలేజని మార్చాలని డిసిప్లిన్ ని పాడు చెయ్యాలని డిసైడ్ చేసుకుంటాడు. ఆ దిశలో ప్రిన్సిపాల్ కూతురునే ప్రేమలో పడేసి ఆయన కి బుద్ది చెప్పాలని నిర్ణయించుకుంటాడు. ఎలా కాలేజీ ప్రిన్సిపాల్ ని ఎలా ఏడ్పించి..కాలేజిని అల్లరి కాలేజీగా మార్చేసాడన్న రీతిలో కథ నడుస్తుంది. ఇలాంటి కథతో వందేమాతరం..డైరక్టర్ గా అవతారమెత్తాడు. ఆయనకు బాగా పట్టున్న పాటలు కూడా ఈ చిత్రంలో మైనస్ గా నిలవటం, డైలాగుల్లో బూతు బాగా ఎక్కువగా ఉండటం, సీన్స్ లో చీప్ టేస్ట్ చూసిన వారు ఇది వందేమాతరం చేసిన బద్మాష్ పని అని అంటున్నారు. ఇంతకీ ఈ చిత్రం రిజల్ట్ ఏమిటీ అంటే పెద్ద ప్లాప్. కాకపోతే జనాలు ఎవరూ పెద్దగా వెళ్ళకపోవటం వల్ల లక్కీగా టాక్ స్పెడ్ కాలేదు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu