Don't Miss!
- News
గవర్నర్ పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!?
- Sports
ఇదో చెత్త పిచ్.. టీ20లకు పనికిరాదు: హార్దిక్ పాండ్యా
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
రాంగోపాల్ వర్మపై పిటిషన్.. పరువు తీశాడు.. భగ్గుమన్న వంగవీటి రాధా.. పకోడిగాడు అంటూ..
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై క్రిమినల్ కేసు నమోదైంది. తమ కుటుంబం పరువు తీశాడని దివంగత వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధా పిటిషన్ దాఖలు చేశాడు. వంగవీటి చిత్రంలో తన తండ్రిని రౌడీ పాత్రలో చూపించారని పిటిషన్‌లో రాధా ఆరోపించారు. సినిమా తీసే ముందు ఇచ్చిన మాటను తప్పాడని, తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా సినిమాను విడుదల చేశాడని వర్మపై రాధా భగ్గుమన్నాడు. ఈ మేరకు విజయవాడ క్రిమినల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

వర్మపై కేసు దాఖలుపై చర్చ..
అయితే వంగవీటి సినిమా విడుదలైన చాలా రోజులకు వర్మపై రాధా కోర్టులో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. సినిమా విడుదలకు ముందు, రిలీజ్ తర్వాత వర్మ, దేవినేని నెహ్రూ, వంగవీటి రాధా మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అయితే వర్మ దానిపై తీవ్రంగా స్పందించారు. వర్మ, రాధా మధ్య చోటుచేసుకొన్న వివాదం ఇప్పుడు కోర్టు మెట్లెక్కడంతో మరింత రంజుగా మారింది.

డబ్బు కావాల్సి వస్తే ముఖాన కొట్టేవాళ్లం..
వంగవీటి చిత్రం విడుదల సందర్భంగా రాంగోపాల్ వర్మపై వంగవీటి రాధకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డబ్బు కోసం వంగవీటి జీవితచరిత్రను కించపర్చేలా చిత్రీకరించి గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. డబ్బు కావాలని అడిగితే రంగా అభిమానులు చందాలు వేసుకుని ముఖాన కొట్టేవాళ్లమన్నారు అని తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే.

ప్రభుత్వంపైనా విమర్శలు
కొద్ది నెలల క్రితం వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ.. తన తండ్రి ఆశయ సాధన కోసం కృషిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. రంగాను హత్య చేసిన వాళ్లు దర్జాగా తిరుగుతున్నా కనిపించడం లేదా అని ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు.

భారీ మూల్యం చెల్లించకతప్పదు.
అన్నీ తెలుసంటూ కోతలు కోసిన వర్మ.. డబ్బు కోసం తన తండ్రి జీవితాన్ని కించపరిచారని, ఇందుకు ఆయన మూల్యం చెల్లించుకోక తప్పదని వంగవీటి రాధ హెచ్చరించారు. అంతేగాక, పకోడిగాడు సినిమా తీశాడు, ఆ యదవ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రాధా వర్గం నిరసన
వంగవీటి సినిమా ద్వారా తమ కుటుంబాన్ని అప్రతిష్టపాల్జేసిన వర్మ తగిన ప్రతిఫలాన్ని అనుభవించక తప్పదని హెచ్చరించారు. రాధా ఇలా ప్రకటించారో లేదో.. వంగవీటి అభిమానులు రెచ్చిపోయారు. రంగా జీవితచరిత్రను వక్రీకరించారంటూ.. రామ్‌గోపాల్‌వర్మ దిష్టిబొమ్మను దహనం ద్వారా నిరసన తెలిపిన సంగతి తెలిసిందే.