»   » తేడా వస్తే..అంటూ వర్మకు గట్టి వార్నింగ్

తేడా వస్తే..అంటూ వర్మకు గట్టి వార్నింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వర్మకు వార్నింగ్ లు కొత్తేమీ కాదు. ఆయన గతంలో రక్త చరిత్ర చిత్రం ప్రారంభించినప్పుడు రకరకాల వర్గాల నుంచి సినిమా ఆపేయమంటూ వార్నింగ్ లు వచ్చాయి. అయితే ఆయన ధైర్యంగా ముందుకు వెళ్లి సినిమా పూర్తి చేసారు. అలాగే రీసెంట్ గా ఆయన వంగవీటి టైటిల్ తో ఎనౌన్స్ చేసినప్పటినుంచి వార్నింగ్ లు మొదలయ్యాయి.

విజయవాడకు చెందిన పొలిటికల్ లీడర్ వంగవీటి రాధా...ఇప్పటివరకూ తనను కానీ, తన ఫ్యామిలీ మెంబర్స్ ని కానీ ఈ సినిమా విషయమై వర్మ సంప్రదించలేదన్నారు. తన తండ్రి పేరుతో తీసే సినిమాలో ఏదైనా తేడా వస్తే మాత్రం పరిణామాలకు తాను భాధ్యత కాదన్నట్లుగా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

Vangaveeti Radha Warning to RGV

ఓ టీవి ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ... సినిమాలో ఉన్నదున్నట్లు వాస్తవాన్ని చూపితే తమకు ఏ అభ్యంతరం లేదని అన్నారు. అంతే తప్ప రంగా జీవితంపై బురదజల్లే ప్రయత్నం చేస్తే మాత్రం ఆయన కుమారుడుగా తానెలా స్పందిస్తానో, తనకంటే రంగా అభిమానులే ఎక్కువ స్పందిస్తారని అన్నారు.

ఇక వర్మ పక్షపాత ధోరణితో వ్యవహరించి సినిమాలు ఎలా తీస్తారో తనకు తెలుసు అని అన్నారు. ఏదో ఒక వర్గం వైపుకు మ్రొగ్గు చూపే సినిమా పూర్తి చేస్తారని అనుమానం వ్యక్తం చేసారు. అలాగే తన ఇంటిపేరుతో సినిమాలు తీసి, అందులో ఇష్టం వచ్చినట్లు చూపితే మాత్రం రంగా అభిమానులే బుద్ది చెప్తారని అన్నారు. ఆ సమయంలో తనకు ఎలాంటి భాధ్యతా లేదని, అవన్నీ దృష్టిలో పెట్టుకునే వర్మ సినిమా తీయాలని తేల్చి చెప్పారు.

English summary
Ranga's son Vangaveeti Radha gave a strict warning to Ram Gopal Varma against showing his father's life in bad light.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu