»   » జయలలిత, శోభాన్ బాబు... బంధంపై వాణి విశ్వనాథ్ కామెంట్స్!

జయలలిత, శోభాన్ బాబు... బంధంపై వాణి విశ్వనాథ్ కామెంట్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నిన్నటితరం హీరోయిన్ వాణి విశ్వనాథ్ త్వరలో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సందర్భంగా ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆమె శోభన్ బాబుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

శోభన్ బాబు వద్ద తాను ఓ చిన్న పిల్లలా ఉండేదాన్నని, కలిసినప్పుడల్లా జయలలిత గురించి అడిగేదాన్నని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో అలా అడగటం తప్పా? ఒప్పా? అన్నది కూడా తనకు తెలిసేది కాదని చెప్పారు.

 వాణి విశ్వనాథ్

వాణి విశ్వనాథ్

జయలలిత, శోభన్ బాబు మధ్య ఎఫైర్ ఉందనే రూమర్స్ నేపథ్యంలో.... వాణి విశ్వనాథ్ ఈ విషయాలను ప్రస్తావించడం చర్చనీయాంశం అయింది. జయలలిత సినిమాల నుండి రాజకీయాల్లోకి వెళ్లడం, తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేసి ఇటీవల అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే.

ఏదో తెలియని వ్యామోహం

ఏదో తెలియని వ్యామోహం

శోభన్ బాబుతో జయలలిత అనుబంధం కేవలం స్నేహం మాత్రమే అని కొందరు, లేదు వారి మధ్య ప్రేమ బంధం కొంతకాలం పాటు సాగిందని మరికొందరు అంటుంటారు. అప్పట్లో శోభన్ బాబు తెలుగు సినీ పరిశ్రమలో సోగ్గాడిగా, గొప్ప అందగాడిగా గుర్తింపు తెచ్చకున్నారు. అప్పట్లో అమ్మాయిల్లో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ మరే హీరోకు లేదు. ఎంతో మంది అమ్మాయిలకు శోభన్ బాబు నిద్రలేకుండా చేసాడు. అయితే జయలలిత మాత్రం శోభన్ బాబుకు నిద్రలేకుండా చేసాడు. అవును... నిజమే! అప్పట్లో జయలలిత అంటే శోభన్ బాబుకు ఏదో తెలియని వ్యామోహం ఉండేది. ఆమెతో కలిసి నటించాలని దాదాపు 8 ఏళ్లు ఎదురు చూసాడు.

మొదట్లో నిరాకరణే

మొదట్లో నిరాకరణే

జయలలిత స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న రోజుల్లో.... అప్పుడప్పుడే ఎదుగుతున్న శోభన్ బాబుతో కలిసి ఓసినిమా చేసేందుకు అప్పట్లో ఓ నిర్మాత ప్రయత్నించాడు. శోభన్ బాబును కలిసి ఓ నిర్మాత వెయ్యిరూపాయల అడ్వాన్స్ ఇచ్చి నా సినిమాలో నువ్వే హీరో, జయలలిత హీరోయిన్ అని చెప్పి శోభన్ బాబులో ఆశలు రేపాడు. అప్పటికి శోభన్ బాబు చిన్న హీరో కావడంతో ఆమె తల్లి సంధ్య ఈ సినిమా చేయడానికి నిరాకరించారు.

తపించాను అంటూ శోభన్ బాబు

తపించాను అంటూ శోభన్ బాబు

ఓ సందర్భంలో శోభన్ బాబు... జయలలిత గురించి మాట్లాడుతూ ‘అప్పట్లో స్టార్ హీరోయిన్ జయలలిత పక్కన నాకు అవకాశం అంటే అదృష్టంగా భావించాను. అప్పటికి నేను ఆమెను చూడలేదు. ఆమెను చూడాలని తపించాను. తపించాననడం కంటే తపస్సు చేశాననే అనాలి. ఆమెతో నటిస్తున్నానని కనిపించని వారికి కూడా చెప్పుకున్నాను. కానీ ఆమె సినిమా అని చెప్పి నిర్మాత కనిపించకుండా పోయాడు. తర్వాత ఏనిమిదేళ్ల తర్వాత ఆమెతో చేసే అవకాశం వచ్చింది అని శోభన్ బాబు తెలిపారు.

డాక్టర్ బాబు మూవీతో జయలలితతో

డాక్టర్ బాబు మూవీతో జయలలితతో

‘డాక్టర్‌ బాబు' ఈ సినిమాకు శోభన్‌బాబు ఖరారైనా హీరోయిన్‌ ఖరారుకాలేదు. సినీ పత్రికలో జయలలిత ఫొటో చూసిన శోభన్ బాబు నిర్మాతకు ఫోన్‌ చేసి జయలలితను తీసుకోవాలని సూచించారట. జయ కూడా అందుకు అంగీకరించింది. అలా తొలిసారి 1973లో జయలలితను కలిశారు శోభన్‌బాబు. ఈ సినిమా భారీ విజయం సాధించింది.

శోభన్ బాబుతో అలా చాలా క్లోజ్

శోభన్ బాబుతో అలా చాలా క్లోజ్

జయలలిత తల్లిని కోల్పోయాక ఒంటరితనం ఫీలయ్యేది. ఈ క్రమంలో శోభన్ బాబుతో పరిచయం ఆమెలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. శోభన్ బాబు సెన్సాఫ్ హ్యూమర్ జయను మరింత ఆకర్షించింది. అందరికీ దూరంగా లంకంత కొంపలో ఒంటిరిదానిలా బతుకుతున్నా నాకు మీ స్నేహం వల్ల అమ్మలోని ఆత్మీయతను తిరిగి చూస్తున్నట్టు అనిపిస్తోంది అంటూ జయలలిత స్వయంగా చెప్పినట్లు ఓసారి శోభన్ బాబు తెలిపారు.

పెళ్లి చేసుకోవాలనుకున్నారట

పెళ్లి చేసుకోవాలనుకున్నారట

డాక్టర్ బాబు సినిమా దగ్గర నుండే వారిద్దరి ప్రేమ చిగురించిందన అంటుంటారు. తర్వాత ఇద్దరూ కలిసి పలు చిత్రాల్లో నటించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం బాగా ముదిరిందని, ఒక దశలో జయలలిత శోభన్ బాబుని పెళ్లి చేసుకోవాలని భావించారని, అప్పటికే పెళ్ళైన శోభన్ బాబు ఆమెని రెండో భార్యగా చేసుకోవడానికి అంగీకరించారని టాక్. అయితే అప్పట్లో వాళ్ళకి ఒక పాప కూడా పుట్టినట్లు పుకార్లు వచ్చాయి.

ఎలా దూరం అయ్యారు?

ఎలా దూరం అయ్యారు?

ఇద్దరికీ ఓ పాప పుట్టినట్లు రూమర్స్ వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య కొన్ని విబేధాలు వచ్చాయని.... శోభన్ బాబుకుకు దూరమైన జయని ఎంజీఆర్ చేరదీశారని అంటుంటారు. తన రాజకీయ భవిష్యత్తు కోసమే జయ ఎంజీఆర్ కు దగ్గరైందని, శోభన్ బాబును పూర్తిగా మరిచిపోయిందని టాక్. ఎంజీఆర్ తర్వాత జయ రాజకీయంగా, సీఎంగా ఎదిగిన సంగతి తెలిసిందే.

English summary
Vani Viswanath comments on Shobhaan Babu and jayalalitha relationship. Vani Viswanath (born 13 May 1971) is an Indian film actress. She has acted in Malayalam, Tamil, Hindi,Telugu and few Kannada movies.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu