For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎన్టీఆర్ భార్యగా అవసరమా ??: వాణీ'స్ వీరగ్రంథం పై అంతటా అనుమానాలే

  |

  ఏ క్షణాన ఎన్టీఆర్ బయోపిక్ అన్న మాట తెరమీదకి వచ్చిందో గానీ ఇప్పుడు మాత్రం రెండురాష్ట్రాల రాజకీయాలు కూడా సినిమా ఇండస్ట్రీలో భాగమయ్యాయా అన్నంత టెన్షన్ లో అటు టాలీవుడ్, ఇటు రాజకీయాలూ కలిసిపోయాయి. ఒక పక్క రామ్ గోపాల్ వర్మ లక్ష్మీ'స్ ఎన్టీఆర్ అని ప్రకటించగనే. దానికి ఫైనాన్స్ వయ్యెస్సార్సీపీనుంచి మద్దతు వచ్చింది, వైసీపీ నేత రాకేష్ దీనికి నిర్మాత అని తెలియగానే కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి 'లక్ష్మీస్ వీరగ్రంథం' పేరుతో సినిమా అంటూ ప్రకటించాడు. అయితే ఈ సినిమాపై లక్ష్మీ పార్వతి అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

  హీరోయిన్ వాణీ విశ్వనాథ్

  హీరోయిన్ వాణీ విశ్వనాథ్

  తన వ్యక్తిగత జీవితాన్ని వక్రీకరించి సినిమాను రూపొందిస్తే తాను కోర్టుకు వెళ్లడానికి కూడా సిద్ధమని ఆమె ప్రకటించింది. ఆ చిత్రంలో లక్ష్మీ పార్వతి పాత్రంలో హీరోయిన్ వాణీ విశ్వనాథ్ నటిస్తోందన్న పుకార్లు కొద్దిరోజులుగా వినిపిస్తున్నాయి. తాజాగా ఆ పుకార్లపై వాణీ విశ్వనాథ్ క్లారిటీ ఇచ్చారు.

   ఎన్టీఆర్ సతీమణిగా నటించడానికి సిద్ధం

  ఎన్టీఆర్ సతీమణిగా నటించడానికి సిద్ధం

  ఆ చిత్రంలో నటించనమని తనకు ఆఫర్ వచ్చిన మాట నిజమేనని,అయితే ఆ విషయంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదనీ, అయితే అన్నీ కుదిరితే ఎన్టీఆర్ సతీమణిగా నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. విజయవాడలోని కనకదుర్గ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా ఆమె మీడియాతో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

  కాంట్రవర్శియల్ ప్రాజెక్ట్ తో

  కాంట్రవర్శియల్ ప్రాజెక్ట్ తో

  త్వరలో టీడీపీలో చేరతానని వాణీ విశ్వనాథ్ కొద్ది రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం ఉన్న వాణీ విశ్వనాథ్ కి అప్పట్లో ఒక మోస్తరు ఫాలోయింగే ఉండేది, అయితే ఇన్నాళ్ళకి మళ్ళీ ఇలాంటి కాంట్రవర్శియల్ ప్రాజెక్ట్‌తో మెయిన్ లీడ్ రోల్ లాంటి క్యారెక్టర్ లో సినిమాల్లోకి అడుగుపెట్టాలని మాత్రం ఆమె అభిమానులు కోరుకోలేదు.

   రాజకీయ భవిశ్యత్తుకోసమే

  రాజకీయ భవిశ్యత్తుకోసమే

  అయితే ఆమె రాజకీయ భవిశ్యత్తుకోసమే ఈ సినిమా చేస్తున్నారు తప్ప మళ్ళీ సినిమాల మీద అభిమానంతో మాత్రం కాదని కొందరి గుసగుసలు మాత్రం "గట్టిగానే" వినిపిస్తున్నాయి. మొత్తానికి ఒకనాటి ఈ బొద్దు హీరోయిన్ ఇప్పుడు టాలీవుడ్ లో తన రెండో ఇన్నింగ్స్ ని ఇలా.., ఇంతపెద్ద కాంట్రవర్సీతో మొదలు పెడుతోందన్నమాట.

   లక్ష్మీ'స్ వీరగ్రంథం

  లక్ష్మీ'స్ వీరగ్రంథం

  అయితే ఇంత గందరగోళ పరిస్థితుల్లో ఆమె లక్ష్మీ'స్ వీరగ్రంథం లో నటించటం మాత్రం ఆమె రాజకీయ, సినీ కెరీర్ కి ఎంతమాత్రం మేలుచేసేది కాకపోవచ్చన్నది ఇప్పటికి వినిపిస్తున్న అభిప్రాయం, సో..! ఏమో... సినిమా వచ్చాక కథ, ఆమె పెర్ఫార్మెన్స్ వాణీ మైలేజ్ పెరొగొచ్చుకూడా.

   ఆయన అభిమానులు మాత్రం.....

  ఆయన అభిమానులు మాత్రం.....

  ఈ రకంగా ఇప్పుడు ఒక నాటి టాలీవుడ్ హీరో, తెలుగు ప్రజల్లో పార్టీలకతీతంగా అభిమానం సంపాదించుకున్న మనిషీ, అప్పటి సమైక్య రాష్టాని ముఖ్యమంత్రీ కూడా అయిన ఎన్టీఆర్ ఇప్పుడు ఇలా మళ్ళీ ఇటు సినిమాల్లోనూ, అటు రాజకీయాల్లోనూ మళ్ళీ కీలకంగా నిలిచారు. నిజానికి ఏ సినిమా ఎలా తీస్తారో గానీ ఎన్టీఆర్ ని మాత్రం ప్రతీరోజూ వివాదం లో ఉంచుతూనే ఉన్నారు అంటూ ఆయన అభిమానులు మాత్రం నిట్టూరుస్తున్నారు.

  English summary
  It's raining biopics on Sr NTR. After Balakrishna Nandamuri and Ram Gopal Varma announced separate biopics on NTR, after these two, Kethireddy Jagadeeshwar Reddy announced a biopic on NTR, with the title - Lakshmi's Veera Grantham, latest news as per the Source., Senioar Actress Vani ViSwanath To Play NTR'S Wife Role In this Movie
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X