»   » హీరోయిన్ వరలక్ష్మి కిడ్నాప్... సోషల్ మీడియాలో వైరల్!

హీరోయిన్ వరలక్ష్మి కిడ్నాప్... సోషల్ మీడియాలో వైరల్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళ హీరోయిన్, ప్రముఖ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి కిడ్నాప్ అయినట్లు.... సోషల్ మీడియాలో వైరల్ అయింది. #VaralaxmiGotKidnapped అనే హాష్ ట్యాగ్ తో వరలక్ష్మికి సంబంధించిన ఫోటో ఒకటి చక్కర్లు కొడుతోంది.

రియల్ గా అయితే వరలక్ష్మి కిడ్నాప్ అయినట్లు అటు పోలీసుల నుండి గానీ, ఇటు కుటుంబ సభ్యుల నుండి గానీ ఎలాంటి సమాచారంలేదు. దీంతో ఇదేదో ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా చేసిందని భావిస్తున్నారు.

సేవ్ శక్తి ప్రమోషన్లో భాగమా?

సేవ్ శక్తి ప్రమోషన్లో భాగమా?

నటి వరలక్ష్మి ఇటీవలే ‘సేవ్ శక్తి' అనే కాంపెయిన్ ప్రారంభించారు. లైంగిక వేధింపులు ఎదురైనపుడు మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయడానికి ముందుకు రావాలని, అదే సమయంలో వారికి సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ కాంపెయిన్ ప్రారంభించారు.

అందుకోసమే ఇలా చేసారా?

అందుకోసమే ఇలా చేసారా?

సేవ్ శక్తి కాంపెయిన్ కి మరింత ప్రచారం కల్పించడానికే ఇలా చేసారా? లేక వరలక్ష్మికి సంబంధం లేకుండా ఇదంతా ఎవరైనా చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.

అభిమానుల కంగారు

అభిమానుల కంగారు

#VaralaxmiGotKidnapped ప్రచారం వెనక ఏం జరుగుతుందో తెలియక అభిమానులు అయోమయంలో పడ్డారు. వరలక్ష్మి దీనిపై స్పందింస్తే బావుంటుందని అభిప్రాయ పడుతున్నారు.

లైంగిక వేధింపులు

లైంగిక వేధింపులు

మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయని, ముఖ్యంగా సినీ రంగంలో ఇది మరింత ఎక్కువగా ఉందని.... తనకు కూడా అలాంటి అనుభవం ఎదురైందని ఆ మధ్య ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు. సినీరంగంలోకి తాను శరీరాన్ని అమ్ముకోవడానికి కాలేదు, నాకు నటన అంటే ఇష్టం... ఇలాంటి సంఘటనలు ఎదురవుతాయని ఊహించలేదు. సినీ పరిశ్రమతో పాటు బయట కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయన్నారు.

English summary
A picture of Varalaxmi Sarathkumar, tied up on the bed, is now spreading virally over the social media with the hashtag, #VaralaxmiGotKidnapped.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu