»   »  నష్ట పరిహారాన్ని కోరుతూ వర్మపై కేసు!!

నష్ట పరిహారాన్ని కోరుతూ వర్మపై కేసు!!

Posted By:
Subscribe to Filmibeat Telugu
ఆగ్ సినిమా రామ్ గోపాల్ వర్మకు కలిసొచ్చినట్టులేదు. ఆ సినిమా ఫ్లాప్ అయిన బాధలో ఉంటే పుండు మీద కారం చల్లినట్టు ఒక చిత్రనిర్మాణ సంస్థ వర్మ మీద కేసు వేశారు. ఆర్.జీ.వి. ఫిలిం ఫ్యాక్టరీ నిర్మించిన నిశ్శబ్ద్ పేరు మీద తామిదివరకే సినిమా నిర్మించామని, తమ పేరును తమకు తెలియకుండా వాడుకున్నారని, ఇందుకు రూ.25లక్షల నష్టపరిహారాన్ని చెల్లించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ఈ కేసును వేశారు. బంగ్లా చిత్ర నిర్మాణ సంస్థ కనుంగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత జహర్ కనుంగో ఈ కేసును వేశాడు. ఆర్.జీ.వి సంస్థ, సూపర్ క్యాసెట్స్, యాడ్ ల్యాబ్స్ సంస్థలనుంచి నష్టపరిహారాన్ని కోరుతూ ఈ కేసు నమోదు అయింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X