»   » సునీల్ తో చేయటం కాకతాళీయం అనిపిస్తోంది

సునీల్ తో చేయటం కాకతాళీయం అనిపిస్తోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

పన్నెండేళ్ల క్రితం సుమంత్‌తో నేను రూపొందించిన ప్రేమకథ చిత్రంలో సుమంత్ స్నేహితుడి పాత్రను వేయడానికి ఓ ఆర్టిస్ట్ వచ్చాడు. ఆ పాత్రకు అతను సరిపోడని రిజెక్ట్ చేశాను. అతనే సునీల్ అంటున్నారు రామ్ గోపాల్ వర్మ గతాన్ని తలుచుకుంటూ. అలాగే పన్నేండేళ్ల గ్యాప్ తర్వాత నేను రూపొందించిన తెలుగు చిత్రం కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అప్పల్రాజు లో సునీల్‌ని హీరోగా పెట్టి సినిమా చేయడం కాకతాళీయం అనిపిస్తోంది అన్నారు రాంగోపాల్ వర్మ. ఆయన దర్శకత్వంలో కిరణ్‌కుమార్ కోనేరు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది.

ఇక ఈ చిత్ర కథ ప్రకారం...అమలాపురం అప్పల్రాజుకి సినిమాయే లోకం. విడుదలైన ప్రతి సినిమా చూడాల్సిందే. అందులోని కథనీ, హీరోల యాక్షన్నీ, డైరక్టర్లు తీసిన విధానాన్నీ చీల్చి చెండాడాల్సిందే. ఆ దర్శకుల కంటే తనెంత బాగా తీసేవాణ్నో కనబడ్డ ప్రతి ఒక్కరికీ చెప్పాల్సిందే. ఇక తన మీద తనకు నమ్మకం పెరిగిపోయాక హైదరాబాద్‌ వచ్చేసి ఫిల్మ్‌నగర్లో వాలిపోయాడు అప్పల్రాజు. ఆ తరవాత అతని సినిమా కల ఏ విధంగా నెరవేరిందో వెండి తెరపై చూడాల్సిందే. అప్పల్రాజు పాత్రలో సునీల్‌ కనిపిస్తాడు. ఇక స్వాతి, సాక్షి హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆదర్శ్‌, కృష్ణుడు, వేణుమాధవ్‌, అలీ, తనికెళ్ల భరణి, చలపతిరావు తదితరులు నటిస్తున్నారు. సమర్పణ: వందిత కోనేరు, కెమెరా: సుధాకర్‌ యెక్కంటి, సహ నిర్మాత: సుమన్‌ వర్మ.

English summary
‘Katha Screenplay Darsakatwam Appalaraju’, the sensational movie by Ram Gopal Varma is hitting screens on 18th of this month. Appalaraju story spins around Appalaraju an innocent young man who stays in Amalapuram. He watches movies a lot and thinks that it is very easy to make films and he comes to Hyderabad. Appalaraju journey starts from there and the movies shows about his struggle in Telugu film industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu