»   » అప్పుడు తొడలన్నాడు, ఇప్పుడు అద్బుతం అట.... ఆవిడని వదలడా ఇక

అప్పుడు తొడలన్నాడు, ఇప్పుడు అద్బుతం అట.... ఆవిడని వదలడా ఇక

Posted By:
Subscribe to Filmibeat Telugu

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ గురించి తెలియని వారుండరు. సినిమాల కంటే వివాదంలో ముందుండే ఈ దర్శకుడు కెరీర్‌ ప్రారంభంలో తెరకెక్కించిన ఎన్నో సినిమాలు అప్పట్లో ట్రెండ్‌ను సెట్‌ చేశాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.శ్రీదేవి తొడలు చూడటం వల్లే తాను దర్శకుదు వివాదాస్పద దర్శకుడు గా ముద్రపడ్డ రామ్ గోపాల్ వర్మ ఈసారి శ్రీదేవి గురించి ట్విట్టర్‌లో తాజాగా ట్వీట్ చేశాడు.

శ్రీదేవి అంటే వర్మకు ఎంతో పిచ్చో అందరికీ తెలిసిందే. శ్రీదేవి అంటేనే వర్మ పడిచస్తాడు. అలాంటిది తాజాగా శ్రీదేవి టైటిల్‌తో ఓ సినిమాను రూపొందించాడు. ఇక ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు రవి ఉద్యావర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మామ్' చిత్రంలో శ్రీదేవి ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ ఏడాది జులైలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఎప్పుడో తీసిన ఈ ఫోటోను సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఇప్పుడు తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. అంతేకాకుండా 'ఈ చిన్నారి బాలిక భారత సినిమా పరిశ్రమలో సూపర్‌స్టార్‌ అవుతుందని ఊహించారా? ఇది నిజంగా చాలా అద్భుతం' అని కామెంట్‌ చేశాడు.

Varma feels Sridevi 'is a miracle'

ఇంతకీ ఆ చిన్నారి బాలిక ఎవరో తెలుసా? తర్వాతి రోజుల్లో ఉత్తరాదిన, దక్షిణాదిన సూపర్‌స్టార్‌గా వెలుగొందిన, రామ్‌గోపాల్‌ వర్మకు ఎంతో ఇష్టమైన శ్రీదేవి. చిన్నప్పుడు తన పేరెంట్స్‌తో దిగిన శ్రీదేవి ఫోటోను వర్మ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. శ్రీదేవికి వీరాభిమాని అయిన వర్మ ఆమెతో 'క్షణక్షణం', 'గోవిందా గోవిందా' వంటి సినిమాలు చేసారన్న విశయం తెలుసు కదా.

English summary
Filmmaker Ram Gopal Varma on Wednesday shared a childhood photo of Sridevi, whom he called a miracle. He wondered how the young girl has gone on to become a superstar in Indian cinema.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu