»   » మెగా హీరోల విషయంలో తప్పు నాదే, వారు నాకు బోర్ కొట్టారు: వర్మ

మెగా హీరోల విషయంలో తప్పు నాదే, వారు నాకు బోర్ కొట్టారు: వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ ద్వారా దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సృష్టించిన సంచలనాలు అన్నీ, ఇన్నీ కావు. ట్విట్టర్‌ వేదికగా ఇతరులను, ముఖ్యంగా మెగాహీరోలను వర్మ విపరీతంగా విమర్శించిన వైనం తెలిసిందే. తాజాగా ట్విట్టర్‌ నుంచి వర్మ నిష్క్రమించాడు. ఇలా నిష్క్రమించడానికి గల కారణం చెబుతూ, మెగా హీరోల విషయంలో తప్పు తనదే అని అంగీకరించాడు.

Varma mentioned his regrets on Megafamily

'నేను ట్విట్టర్‌ ద్వారా ఎవరినైతే టార్గెట్‌ చేయాలనుకున్నానో, వారు నాకు బోర్‌ కొట్టారు. అలాగే నేను వారిపై చేసే ట్వీట్లు కూడా నాకు బోర్‌ కొట్టాయి. అందుకే ట్విట్టర్‌ నుంచి బయటకు వచ్చేశా. ఇక, మెగా హీరోల విషయంలో తప్పు నాదే. ఎవరికైనా భావ ప్రకటన స్వేచ్ఛ ఉండొచ్చు, కానీ, అది అవతలి వ్యక్తుల మనోభావాలను దెబ్బతీయకూడదు. అది ఆలస్యంగా తెలిసి బుద్ధి వచ్చింద'ని చెప్పాడు వర్మ.

English summary
Director Ramgopal varma Mentioned his Regrets on his Tweets About Megafamily
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu