»   » పోయి..పోయి గాంధీ జయంతి రోజేనా..?? ఇందుగ్గాదూ... ఆర్జీవీ అంటేనే వివాదం అనేది....!

పోయి..పోయి గాంధీ జయంతి రోజేనా..?? ఇందుగ్గాదూ... ఆర్జీవీ అంటేనే వివాదం అనేది....!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తన సినిమా మొదలైన దగ్గర్నుంచీ ఏదో ఒక వివాదస్పద వ్యాఖ్యతో తానూ వార్తల్లో ఉంటూ తన సినిమా నీ వార్తల్లో ఉంచుతూ ప్రమోషన్ మొదలూ పెట్టేస్తాడు రామ్ గోపాల్ వర్మ అదే దారిలో బెజవాడ రాజకీయాలపై సినిమా అనీ, "వంగవీటి" అనేది తన సినిమాపేరు అని చెప్పి ఒక్కసారి. విజయవాడని ఒక కుదుపుకే గురి చేసాడు వర్మ. అసలు ఆ టైటిల్ వాడటానికే దమ్ము కావాలి.., దాడిని ఎదుర్కునే దైర్యం ఉండాలి. అనుకున్నట్టే టైటిల్ మీదా, సినిమా సబ్జెక్ట్ మీదా వివాదం చెలరేగింది. బెజవాడలో అడుగు పెడితే దాడి చేస్తాం అన్నారు బెజవాడీయులు... మీది లోకల్ రౌడీయిజం అయితే నాది నేషనల్ మాఫియా.... ముంబయ్ లో అడుగుపెట్టి చూడండీ అంటూ ఎప్పుడూ ఉండే అదే గీర తో సమాధానం ఇచ్చాడు వర్మ...

ఫిబ్రవరిలోనే వంగవీటి సినిమా ఆడియో ట్రైలర్ కూడా విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించి ఓ పోస్టర్ కూడా రిలీజైంది. వర్మ తన సినిమాకు సంబంధించి వరసగా ఒక్కొక్కటి రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. ఆమధ్య నటీనటుల సెలెక్షన్ కూడా పెట్టి కొందరిని సెలెక్ట్ చేసుకున్నాడు. వంగవీటి రంగాగా నటించే వ్యక్తికి మేకప్ చేయించి ఆ స్టిల్ కూడా విడుదల చేశాడు వర్మ. వర్మ తన సినిమా పబ్లిసిటీకి రకరకాల జిమ్మిక్కులు చేస్తాడు. అదే దారిలో ఇప్పుడుఇ ఇంకో వింత నిర్ణయం తీసుకున్నాడు. తాను తీసే వంగవీటి చాల "శాంతి" ని చూపించే సినిమా అనీ అందుకే తాను ఈ అక్టోబర్ రెండున ఈ సినిమా ట్రైలర్ విడుదల చేస్తున్నా అంటూ ప్రకటించాడు.... అన్నట్టు అక్టోబర్ రెండు ఏమిటో తెలుసు కదా....

వంగ వీటి పీస్ ఫుల్ మూవీ న?

వంగ వీటి పీస్ ఫుల్ మూవీ న?

గాంధీ జయంతి రోజు నరుక్కోవటమూ చంపుకోవటమూ ఉండే సినిమా గురించిన ట్రైలర్ విడుదల చేస్తున్నాను అనటమూ...మళ్ళీ తనది "పీస్ ఫుల్ మూవీ" అంటూ వెటకారం చేయటం ద్వారా మరో సారి వివాదం తో ట్రైలకి హైప్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడీ దర్శక డాన్

ఇదే లాస్టు అన్నాడు

ఇదే లాస్టు అన్నాడు

వంగవీటి హత్యోదంతంపై....ఆయన జీవితంపై సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత ఇక తెలుగులో వర్మ సినిమాలు ఉండక పోవచ్చు. 'వంగవీటి' సినిమా తర్వాత తాను తెలుగులో సినిమాలు తీయనని చెప్పాడు.

ఇలాంటి కథ ఇంక ఉండదు

ఇలాంటి కథ ఇంక ఉండదు

"శివ" తో మొదలైన నా తెలుగు సినిమా ప్రయాణం "వంగవీటి"తో ముగించాలని నేను తీసుకున్న నిర్ణయానికి కారణం "వంగవీటి" కన్నా అత్యంత నిజమైన మహా గొప్ప కథ మళ్ళీ నాకు జీవితంలో దొరకదని నాకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి అంటూ... అన్నాడు కు కానీ ఆ తర్వాత తీసే మరిన్ని సినిమాలూ ప్లాంచేసుకుంటున్నాడు కూడా.

చంపటం తో మొదలై చావుతోనే

చంపటం తో మొదలై చావుతోనే

వంగవీటి రాధాగారు, చలసాని వెంకటరత్నం గారిని చంపడంతో ఆరంభమైన విజయవాడ రౌడీయిజం, వంగవీటి రంగాగారిని చంపడంతో ఎలా అంతమయ్యిందో చూపించేదే "వంగవీటి" చిత్రం.

కులం పేరుతో పాట

కులం పేరుతో పాట

ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ సినిమా ప్రీ రిలీజ్ హైప్ తేవాలని మాత్రం ఓ రేంజిలో కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ఆ మధ్యన ఈ చిత్రంలో వంగవీటి ఫస్ట్ల్ లుక్ వదిలిన వర్మ కమ్మ కమ్మ కమ్మ అంటూ కులం పేరుతో సాగే ఒక పాటను కూడా వదిలి మరింత సెగ రాజేసాడు.

బెజవాడ రౌడీ రాజకీయాల నేపథ్యంలో

బెజవాడ రౌడీ రాజకీయాల నేపథ్యంలో

రౌడీయిజమన్నా.. వయొలెన్స్ అన్నా ఆయనకు మహా ప్రీతి. ఎక్కువగా ఆ నేపథ్యమున్న సినిమాలే తీస్తుంటాడు వర్మ. ఆయన తీస్తున్న లేటెస్ట్ మూవీ ‘వంగవీటి'లోనూ బోలెడంత వయొలెన్స్ ఉంటుందనడంలో ఎవరికీ సందేహాల్లేవు. పేరు చూస్తేనే ఇది బెజవాడ రౌడీ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా అని చెప్పేయొచ్చు.

పీస్ ఫుల్ అట

పీస్ ఫుల్ అట

అందులో వయొలెన్స్‌కు ఢోకా ఉండదనీ అందరికీ తెలుసు. ఐతే వర్మ మాత్రం ఇది చాలా పీస్ ఫుల్ సినిమా అంటూ కామెడీ చేస్తున్నాడు. అప్పుడెప్పుడూ ‘వంగవీటి' అనౌన్స్‌మెంట్ తర్వాత దీని ఊసే ఎత్తని వర్మ.. ఇప్పుడు ఉన్నట్లుండి ట్రైలర్ రిలీజ్ అంటున్నాడు.

అక్టోబరు 2న

అక్టోబరు 2న

‘వంగవీటి' ట్రైలర్‌ను అక్టోబరు 2న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు వర్మ. అక్టోబరు 2 ఏంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ రోజు గాంధీ జయంతి. తనది చాలా పీస్ ఫుల్ మూవీ అని.. అందుకే అక్టోబరు 2న ట్రైలర్ రిలీజ్ పెట్టుకున్నానని చెప్పతం లోనే "వంగ వీటి కి ఎంత హైప్ తేవాలనుకుంటున్నాడో తెలుస్తోంది.

కత్తితో పొడుస్తా అన్నాడు

కత్తితో పొడుస్తా అన్నాడు

"విజయవాడ రౌడీయిజం గురించి నాకన్నా ఎక్కువ తెలిసిన వాడు, విజయవాడలో కూడా లేడని బల్ల గుద్దే కాకుండా కత్తితో కూడా పొడిచి చెప్పగలను." అని చెప్పిన వర్మ. ఇప్పుడు నాది పీస్ ఫుల్ మూవీ..., గాధీ జయంతి రోజు విడుదల చేస్తా అంటూ... మొదలెట్టాడు.

వర్మ పాత్ర కూడా కనిపిస్తుంది

వర్మ పాత్ర కూడా కనిపిస్తుంది

వంగవీటి రాధా, వంగవీటి మోహన రంగా, వంగవీటి రత్నకుమారి, దేవినేని నెహ్రు, దేవినేని గాంధీ, దేవినేని మురళి, కర్నాటి రామమోహనరావు, సిరిస్ రాజు, రాజీవ్ గాంధీ, నందమూరి తారక రామారావుతో పాటు ఈ చిత్రంలో తన పాత్ర కూడా ఉంటుందని చెప్పి ఆసక్తిని కూడా పెంచాడు.

English summary
Ram Gopal Varma Violent Movie "vangaveeTi" Trailer To Be Released On Gandhi Jayanthi
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu