»   » రామ్ గోపాల్ వర్మ లో ఇంత మార్పా..!?

రామ్ గోపాల్ వర్మ లో ఇంత మార్పా..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

వర్మ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఒక వివాదమో సంచలనమో ఆయన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది.
తాను తీసే సినిమాపై ఆయన ఏదో రకంగా క్రేజ్ ని క్రియేట్ చేస్తుంటాడు. తాను వార్తల్లో నిలుస్తూ తన సినిమాలకి పబ్లిసిటీ పెరిగేలా చూసుకుంటూ ఉంటాడు. ఇలా ఎందుకూ అంటే భారీ బడ్జెట్లకి తాను పెద్దగా సుముఖంగా ఉండడు, ఏదో ఒక కాంట్రవర్సీ సృష్టించి సినిమా ప్రచారం తానొక్కడే చేయగలడు.

అయితే ఈ మధ్య లో వర్మలో మార్పు వచ్చిందా..!?వర్మ చేసే కొన్ని పనులను బట్టి అలానే అనుకోవాల్సి వస్తోంది మరి. మొన్నటికి మొన్న "నా పొగరు వల్లే నా సినిమాలు ఫ్లాప్ ఔతున్నాయి" అంటూ తానే తన ఓటమికి కారణం అంటూ చెప్పిన వర్మ. ఈ రోజు సాయంత్రం 6 గంటలకి ప్రారంబించబోయే సినిమా "రాయ్" ని సినిమాకి యాభై వేల మంది సమక్షంలో ప్రారంబించబోతున్నామంటూ, టపాసుల మోతలు - లేజర్ షో హంగుల మధ్య ఫస్ట్ లుక్ తో సినిమాని మొదలు పెడతామని వర్మ ట్వీట్ చేసి అందర్నీ షాక్ కి గురి చేసాడు.

varma says hes new movi "Roy" launch is costliest launch ever of film's1st look in front of 50,000ppl with fireworks and laser shows

సినిమా ప్రారంభోత్సవాల విషయంలోనూ ఆడియో రిలీజ్ ల విషయంలో హంగు ఆర్భాటాల జోలికి అస్సలు వెళ్లరు వర్మ. కానీ తొలిసారి అందుకు భిన్నంగా రాయ్ సినిమాని తీస్తున్నాడు. మాఫియా డాన్ ముత్తప్పరాయ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. ఈ చిత్రాన్ని 55కోట్ల వ్యయంతో తెరకెక్కించబోతున్నాడట రామ్ గోపాల్ వర్మ. ఆ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు వర్మ.

ఇంత భారీ వ్యయం - ఇంత హంగు ఆర్భాటాల మధ్య వర్మ తీస్తున్న సినిమా ఇదే అని స్వయంగా వర్మే ఒప్పుకున్నాడు కూడా . ఇందులో "రాయ్" గా వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నాడు. మొదట ఆ పాత్ర కోసం సుదీప్ ని ఎంచుకోవాలనుకున్నారు. కానీ చివరి నిమిషంలో వివేక్ ఒబెరాయ్ ఈ ప్రాజెక్టులోకి వచ్చాడు.

English summary
Ramgopal varma launching his new movie To day at 6 pm today wil be biggest and costliest launch ever of film's1st look in front of 50,000ppl with fireworks and laser shows
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu