»   » మహేష్ బాబు దేశద్రోహి, విశాఖ "ఇరాక్" లా ఉంది: వర్మ ట్వీట్లు మళ్ళీ కలకలం రేపేలా ఉన్నాయి

మహేష్ బాబు దేశద్రోహి, విశాఖ "ఇరాక్" లా ఉంది: వర్మ ట్వీట్లు మళ్ళీ కలకలం రేపేలా ఉన్నాయి

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు సాధారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటాడు. ఎన్నికల సమయంలో బావ గల్లా జయదేవ్‌ గురించి ఏదో ఒక్క ట్వీట్‌ తప్ప పొలిటికల్‌ ఇష్యూల గురించి స్పందించడు. తెలంగాణ విభజన, ప్రత్యేక హోదా వంటి విషయాల గురించి కూడా మహేష్‌ ఎప్పుడూ మాట్లాడలేదు. అలాంటి మహేష్‌ పొరుగు రాష్ట్రంలో జరుగుతున్న 'జల్లికట్టు' గురించి స్పందించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబుపై వివాదాల డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన డబ్బింగ్ మూవీలను ప్రమోట్ చేసుకోవడానికి తమిళ వికృత క్రీడ జల్లికట్టుకు మద్దతు తెలిపిన మహేశ్ బాబు.. తనను స్టార్‌గా నిలబెట్టిన ఏపీ కోసం, ఏపీ ప్రజల కోసం ఎందుకు మద్దతు తెలపట్లేదని ప్రశ్నించాడు. ఏపీ ప్రత్యేక హోదా కోసం పోరాడకుండా.. పక్క రాష్ట్రాల వారు చేసే ఆందోళనకు మద్దతు తెలుపుతున్న మహేశ్ దేశ ద్రోహి అంటూ సంచలన వ్యాఖ్య చేశాడు.

 వదంతి:

వదంతి:

మహేష్‌ ‘జల్లికట్టు' గురించి స్పందించడానికి కారణం త్వరలో విడుదల కాబోతున్న సినిమా అంటూ కూడా ఒక వదంతి బయల్దేరింది. ప్రస్తుతం మురుగదాస్‌ దర్శకత్వంలో మహేష్‌ నటిస్తున్న చిత్రం తెలుగుతోపాటు తమిళంలోనూ విడుదలవుతోంది. ఆ సినిమా ప్రమోషన్‌ కోసమే

 నిరసన గురించి:

నిరసన గురించి:


మహేష్‌ ‘జల్లికట్టు' ఇష్యూను వాడుకున్నాడని అందరూ అనుకుంటున్నారు. అక్కడి వరకు బాగానే ఉంది కానీ.. ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక హోదా నిరసన గురించి మహేష్‌ నుంచి కనీస స్పందన లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.ఈ నిరసనకు సినీ పరిశ్రమ వ్యక్తులు

 విమర్శలకు కారణం:

విమర్శలకు కారణం:


మద్ధతు ప్రకటిస్తున్న నేపథ్యంలో మహేష్‌ మాత్రం సైలెంట్‌గా ఉండడం విమర్శలకు కారణం. ఈ విషయంలో సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ కూడా మహేష్‌ను తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే. మహేష్‌బాబును ఏకంగా ‘దేశద్రోహి' అంటూ ట్వీట్ చేసిన వర్మ.

 అభిమానులు కూడా:

అభిమానులు కూడా:


ఏపీ సమస్యలను పట్టించుకోకుండా పక్క రాష్ట్రం సమస్యపై వారి ఆందోళనకు మహేశ్ మద్దతు తెలపడంతో ఆంతర్యం ఏంటని ప్రశ్నించాడు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న పవన్ కల్యాణ్‌కు మద్దతు తెలపాల్సిందిగా మహేశ్‌కు చెప్పని అతడి అభిమానులు కూడా మహేశ్‌లాగానే దేశద్రోహులని వ్యాఖ్యానించాడు.

 పవన్ పోరాడుతున్నా :

పవన్ పోరాడుతున్నా :


మహేశ్ రాజకీయాల్లో లేనప్పుడు ఏపీ సమస్యలపై పవన్ పోరాడుతున్నా ఏం పట్టనట్టుండి.. తమిళ జల్లికట్టుపై తన ఆవేదనను వ్యక్త పరచడం దేనికి సంకేతం అని ప్రశ్నలు సంధించాడు. కాగా, మహేశ్‌పై విమర్శనాస్త్రాలు సంధించిన వర్మ.. పవన్‌పై మాత్రం పొగడ్తల వర్షం కురిపించాడు.

 ప్రభుత్వాలపైనే పోరాడుతున్నాడు:

ప్రభుత్వాలపైనే పోరాడుతున్నాడు:


ఆర్నాల్డ్, సిల్వెస్టర్ స్టాలోన్, బ్రూస్‌లీ వంటి వారు సాధారణ సమస్యలపైనే పోరాడితే.. పవన్ మాత్రం ప్రభుత్వాలపైనే పోరాడుతున్నాడని ప్రశంసించాడు. హీరోలంతా సినిమాల్లో రాజకీయ నాయకులు, పోలీసులపై పోరాడుతుంటే.. పవన్ మాత్రం నిజ జీవితంలో రాజకీయ నాయకులతో పోరాడుతున్నాడని ట్వీట్ చేశాడు.

 ఇరాక్ లా విశాఖ

ఇరాక్ లా విశాఖ" ఉందంటూ:


ఈ రోజు పొద్దున కూడా విశాఖ లోని ఒక ఫొటో ట్వీట్ చేసి యుద్దవాతావరణం లో ఉన్న ఇరాక్ లా కనిపిస్తోందంటూ మరో చిన్న సైజు వివాదం లోకి తల దూర్చాడు. పొద్దుటి నుంచీ ప్రత్యేక హోదా కోరుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఆర్కే బీచ్ దగ్గర నిరసన తెలపటానికి సిద్దమైన సంగతి తెలిసిందే. అక్కడ అరెస్టులు కొనసాగుతూంటే... మరి కొన్ని చోట్ల చెక్ పోస్టులూ, రోడ్లమీద బ్యారికేడ్ లూ పెట్టిన పోలీసులతో ఉన్న విశాఖ ని చూసిన వర్మ "ఇరాక్ లా విశాఖ" ఉందంటూ ట్వీట్ చేసాడు...

English summary
Vizag is looking like in a war atmosphere of Iraq..SHOCKING! Tweets Ramgopal varma
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu