»   » రాజమౌళి ఉన్నారు! వాళ్లని పొగడొద్దు(వర్ణ ఆడియో ఫోటోలు)

రాజమౌళి ఉన్నారు! వాళ్లని పొగడొద్దు(వర్ణ ఆడియో ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అనుష్క మెయిన్ రోల్‍‌లో, ఆర్య కథానాయకుడుగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో పి.వి.పి సినిమా బేనర్లో తెరకెక్కిన భారీ చిత్రం 'వర్ణ'. ఈచిత్రం ఆడియో వేడుక ఆదివారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ ఆడియో వేడుకకు సినిమా యూనిట్ సభ్యులతో పాటు పలువురు తెలుగు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా దర్శకుడు సెల్వరాఘవన్ మాట్లాడుతూ...'నేను ఈ సినిమా కథతో చాలా మందిని సంప్రదించాను. దీన్ని కార్టూన్ ఫిల్మ్‌గా మాత్రమే చేయగలం...సినిమాగా చేయలేం అని చాలా మంది అన్నారు. కానీ నిర్మాత ప్రసాద్ గారు ఎంతో నమ్మంతో సినిమా తెరకెక్కించడానికి ఒప్పుకున్నారు. ఈ సినిమా క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతుంది' అన్నారు.

ఈ మధ్య పలువురు హాలీవుడ్ సినిమాలను తెగ పొగిడేస్తున్నారు. వాళ్లను ఎందుకు పొగుడుతున్నారో అర్థం కావడం లేదు. మన సినిమాలు చూసి గర్వ పడండి. ఇక్కడ రాజమౌళి లాంటి ఎందరో గొప్ప దర్శకులు ఉన్నారు. ఇంకో 10, 15 ఏళ్లలో అవతార్ కన్నా గొప్ప సినిమాలు మనం చేస్తాం. హాలీవుడ్‌ను పొగడటం మానేయండి' అని సెల్వరాఘవన్ వ్యాఖ్యానించారు.

స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

నిర్మాత మాట్లాడుతూ..

నిర్మాత మాట్లాడుతూ..


ఈ సినిమా క్రెడిట్ సెల్వ రాఘవన్, అనుష్క, ఆర్యలకే దక్కుతుంది. వీళ్లు ముగ్గురు లేకుంటే వర్ణ అనే రంగుల ప్రపంచాన్ని మీకు చూపించలేం. రెండేళ్ల పాటు ఎంతో కష్టపడి సినిమా తీసాం. ఈచిత్రం తప్పకుండా ప్రేక్షకులను రంజింప చేసే విధంగా ఉంటుంది అన్నారు.

అనుష్క మాట్లాడుతూ...

అనుష్క మాట్లాడుతూ...


దర్శకులు, నిర్మాతలు నాపై నమ్మకంతో మంచి రోల్స్ ఇచ్చారు కనుకే ఇలాంటి సినిమాలు చేయగలిగాను. దర్శకుడు సెల్వ, నిర్మాత ప్రసాద్ గారు లేకుంటే ఈ సినిమా లేదు. ఈదొక లవ్ స్టోరీ. ఇప్పటి వరకు ఎవరూ చూడని విధంగా ఉంటుంది అన్నారు.

ఆర్య మాట్లాడుతూ...

ఆర్య మాట్లాడుతూ...


ఈ సినిమాకు నేను హీరో కాదు.... అనుష్కనే హీరో. ఆమె కత్తి పట్టడంలో ఎక్స్‌పర్ట్. సినిమా అందరికీ నచ్చే విధంగా విభిన్నంగా ఉంటుంది అన్నారు.

సంగీత దర్శకుడు హరీష్ జైరాజ్ మాట్లాడుతూ..

సంగీత దర్శకుడు హరీష్ జైరాజ్ మాట్లాడుతూ..


ఈ సినిమాకు పని చేసే అవకాశం రావడం ఎంతో గొప్పగా భావిస్తున్నాను. ఆర్య, అనుష్క వల్ల నా పాటలకి కొత్త కలర్ వచ్చింది. అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చాడు. చంద్రబోస్ మంచి లిరిక్స్ ఇచ్చారు అన్నారు.

చంద్రబోస్ మాట్లాడుతే...

చంద్రబోస్ మాట్లాడుతే...


సెల్వరాఘవన్ దర్శకత్వంలో పని చేయడం ఆనందంగా ఉంది. ఆయన నాతో దగ్గరుండి పాటలు రాయించుకున్నారు. హరీస్ జైరాజ్ మంచి సంగీతాన్ని అందించారు. సినిమా పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు.

English summary

 Varna Telugu Movie Audio Release Function held at Shilpakala Vedika, Hyderabad. Anushka Shetty, Arya, Director Selvaraghavan (Sri Raghava), Producer Prasad V.Potluri (PVP), Music Director Harris Jayaraj, Selvaraghavan Wife Geethanjali, Sai Korrapati, BVSN Prasad, Chandrabose (lyricist), Maruthi, Suresh Kondeti, Harris Jayaraj wife Suma, Rachana Maurya, Gautham Raju graced the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu