»   » అనుష్క నటించిన ‘వర్ణ’ లేటెస్ట్ అప్డేట్స్

అనుష్క నటించిన ‘వర్ణ’ లేటెస్ట్ అప్డేట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆర్య, అనుష్క జంటగా 7/జి బృందావన్ కాలనీ ఫేం సెల్వరాఘవన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ వర్ణ. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే లాంటి సినిమాతో తెలుగు ప్రేక్షకులు పరిచయమైన సెల్వరాఘవన్‌ ఇక్కడ కూడా ప్రత్యేక గుర్తింపు సొంతంచేసుకున్నాడు. ఈ చిత్రం ఆడియో అక్టోబర్ 26న విడుదల చేసి నవంబర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

దర్శకుడు సెల్వరాఘవన్ మాట్లాడుతూ...'ఇప్పటికే తమిళంలో విడుదలైన ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో తెలుగులో కూడా ఈ సినిమా ఆడియోతో పాటు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఎన్నో హాలీవుడ్ సినిమాలకు అద్భుతమైన రీ రికార్డింగ్ అందించిన బుడాపేస్ట్ స్టూడియోలో ఈ సినిమా రీరికార్డింగ్ వర్కు జరుగుతోంది' అని తెలిపారు.

నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి మాట్లాడుతూ..'అత్యంత భారీ వ్యయంతో అద్భుతమైన గ్రాఫిక్స్‌తో ఈ సినిమాను తెరకెక్కించాము. ఇప్పటికే తమిళంలో విడుదలైన ఆడియో మంచి స్పందన వచ్చింది. హరీష్ జైరాజ్ అద్భుతంగా సంగీతం అందించారు. దీనికి తోడు అనిరుధ్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత ప్లస్ అవనున్నాయి. కోలా భాస్కర్ ఎడిటింగ్, రామ్ జీ కెమెరా వర్క్ ఆకట్టుకుంటాయి. అక్టోబర్ 26న వర్ణ ఆడియోను హైదరాబాద్ శిల్పకళావేదికలో పలువురు తెలుగు, తమిళ సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా విడుదల చేస్తున్నాం. సినిమాను నవంబర్లో విడుదల చేస్తాం' అన్నారు.

గతంలో 'అరుంధతి' చిత్రంలో కత్తి పట్టిన అనుష్క....వర్ణ చిత్రంలో కత్తి పోరాటాలు చేస్తూ సాహస యువతిగా కనిపించనుంది. ఈ పోస్టర్లు చూస్తుంటే సినిమా విభిన్నంగా, సరికొత్తగా ఉంటుందని స్పష్టం అవుతోంది. గతంలో 'యుగానికి ఒక్కడు' లాంటి విభిన్నమైన సినిమాలు తెరకెక్కించిన సెల్వరాఘవన్ ఈ సినిమానే ఎలా చూపించబోతున్నాడు అనే ఆసక్తి నెలకొంది.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రంలో అనుష్క ద్విపాత్రాభినయం చేసింది. ఒక పాత్రలో ఆమె సాధారణ గృహిణిగా, ఒక పాత్రలో ట్రైబల్ ఉమన్(ఆటవిక యువతి)గా కనిపించనుంది. జార్జియా అడవుల్లో అనుష్కపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సినిమాలో పోషిస్తోన్న విలక్షణమైన పాత్ర కోసమే అనుష్క మార్షల్ ఆర్ట్స్ ని సైతం నేర్చుకుంది. అరుంధతి తర్వాత అనుష్కకు ఈచిత్రం బాగా పేరు తెస్తుందనే టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది.

English summary
Arya and Anushka starrer 'Varna' audio will be releasing October 26th, which is being directed by Selva Raghavan. Param V Potluri, the producer of 'Balupu', is producing this movie on PVP Cinema banner. Anushka's role is going to be very important in this movie, and visual effects are given prior importance.
Please Wait while comments are loading...