»   » అనుష్క 'వర్ణ' సెన్సార్ పూర్తి

అనుష్క 'వర్ణ' సెన్సార్ పూర్తి

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : ఆర్య,అనుష్క జంటగా నటించిన చిత్రం వర్ణ(ఇరండామ్ ఉలగం). సంచలన దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వం వహించారు. ఈ అత్యంత భారీ చిత్రాన్ని పీవీపీ సినిమా పతాకంపై పొట్లూరి ప్రసాద్ నిర్మిస్తున్నారు. హరీష్ జయరాజ్ సంగీత బాణీలు కట్టిన ఈ చిత్రానికి యంగ్ సంగీత దర్శకుడు అనిరుద్ నేపథ్య సంగీతాన్ని అందించారు. చిత్రం ఈ నెల 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం సెన్సార్ పూర్తైంది. క్లీన్ U సర్టిఫికేట్ తో బయిటపడింది. వర్ణం చూసిన సెన్సార్ మెంబర్స్...కంటెంట్,గ్రాండియర్ గా విజువల్స్ చూసి చాలా మెచ్చుకుని ఒక్క కట్ కూడా చెప్పలేదన్నారు. తెలుగులో 1200 థియోటర్స్ లో విడుదల కానుంది.

  వర్ణ చిత్ర విశేషాల గురించి అనుష్క చెప్తూ...ఇదో అద్భుత విజువల్ ట్రీట్. ఫాంటసీ కథాంశంతో సాగే వైవిధ్యభరిత కథా చిత్రం. దర్శకుడు సెల్వరాఘవన్ కథ చెప్పినప్పుడే చాలా ఎగ్జైటింగ్‌గా ఫీలయ్యాను. ఈ కథను తెర పై ఆవిష్కరించడం సాధ్యమా? అన్న సందేహం కలిగింది. దర్శకుడు చిత్రాన్ని అద్భుతంగా సెల్యులాడ్‌పై ఆవిష్కరించారు. వర్ణ చిత్రంలో నటించడం కొత్త అనుభవం అన్నారు.

  అలాగే...ఎవరైనా కొత్త కాన్సెప్ట్‌తో కూడిన చిత్రాలు చేయడానికి ఎవరైనా ఎగ్జైట్‌గా ఫీలవుతారు. మేమూ ఈ చిత్రాన్ని ఇష్టపడి చేశాం. యూనిట్ అంతా హార్డ్ వర్కు చేశాం. చిత్రంలో ఎమోషనల్ సన్నివేశాలు సూపర్‌గా వచ్చాయి. ఇక్కడ హీరో ఓరియంటెడ్? హీరోయిన్ ఓరియంటెడ్ కథ అన్నది ముఖ్యం కాదు. ఏ చిత్రానికైనా స్క్రిప్టు ముఖ్యం. మంచి కథ అని పిస్తే ఏ భాషలోనైనా నటించడానికి సిద్ధమే అన్నారు..


  ఆర్య కచ్చితంగా హీరోయిన్ల హీరోనే. ఆయనతో కలిసి నటించడం చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఎలాంటి కాంప్లికేట్స్ ఉండవు. ఇరండామ్ ఉలగం చిత్ర షూటింగ్‌ను జార్జియాలో 90 రోజుల పాటు ఏక షెడ్యూల్ చేశాం. సౌకర్యం లేకపోయినా కష్టపడి ఇష్టంగా కలిసి పని చేశాం.

  అంతర్జాతీయ స్థాయిలో సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయిదు విదేశీ భాషల్లో తెరపైకి రానుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. పీవీపీ బ్యానరుపై తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవల సెన్సార్‌కు వెళ్లొచ్చింది. అక్కడ 'యు' ధ్రువపత్రం లభించింది. అంతేకాదు... చిత్ర యూనిట్‌ను అభినందించిందట సెన్సార్‌బోర్డు. ఈ సినిమాకు సంగీతం హ్యారీస్‌ జయరాజ్‌, నేపథ్య సంగీతం అనిరుధ్‌ సమకూర్చారు. ఇందులో వాస్తవానికి అద్దం పట్టేలా పలు గ్రాఫిక్‌ సన్నివేశాలు ఉన్నాయని, అవి బాగా ఆకట్టుకుంటాయమని చిత్రవర్గాలు తెలిపాయి.


  ఈ చిత్రంలో అనుష్క ద్విపాత్రాభినయం చేసింది. ఒక పాత్రలో ఆమె సాధారణ గృహిణిగా, ఒక పాత్రలో ట్రైబల్ ఉమన్(ఆటవిక యువతి)గా కనిపించనుంది. జార్జియా అడవుల్లో అనుష్కపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సినిమాలో పోషిస్తోన్న విలక్షణమైన పాత్ర కోసమే అనుష్క మార్షల్ ఆర్ట్స్ ని సైతం నేర్చుకుంది. అరుంధతి తర్వాత అనుష్కకు ఈచిత్రం బాగా పేరు తెస్తుందనే టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రామ్‌జీ, సంగీతం: హారిస్‌ జైరాజ్‌.

  English summary
  Anushka Shetty starrer Varna was cleared by Censor Board with a clean U certificate. No cuts were suggested. The members who watched Varna were highly appreciative of the content and praised the visual grandeur and the effort that went into this production. PVP Cinema, the production house behind this magnum opus, will release in Telugu and Tamil in about 1200 theatres.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more