For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  వర్ణ మూవీ టాకేంటి? ఆడియన్స్ ట్వీట్ రివ్యూ

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: అనుష్క, ఆర్య జంటగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'వర్ణ' చిత్రం భారీ అంచనాల మధ్య ఈ రోజు విడుదలైంది. రూ. 65 కోట్ల భారీ బడ్జెట్‌తో విభిన్నమైన కథాంశం, భారీ గ్రాఫిక్స్‌తో తెరకెక్కిన ఈచిత్రం ప్రేక్షకులను ఎప్పటి నుండో ఊరిస్తోంది. యుగానికొక్కడు లాంటి హిట్స్ ఇచ్చిన దర్శకుడు కావడంతో అంచనాలు ఆకాశాన్ని అంటాయి.

  'వర్ణ' ఒక రొమాంటిక్ ఫాంటసీ ఫిల్మ్. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం సెల్వరాఘవన్. రెండు విభిన్నమైన ప్రపంచాల నేపథ్యంలో ఈ చిత్రం నడుస్తుంది. ఈచిత్రంలో ఆర్య, అనుష్క ద్విపాత్రాభినయం చేసారు. ఈ చిత్రంలో క్యారెక్టర్ కోసం ఆర్య సిక్స్ ప్యాక్ బాడీ పెంచడం విశేషం. చిత్రంలోని పోరాట సన్నివేశాల కోసం ఆర్య, అనుష్క కత్తి యుద్ధంలో శిక్షణ పొందారు.

  ఆంధ్రప్రదేశ్‌లోని అందమైన లొకేషన్లతో పాటు, జార్జియా దేశంలోని అడవుల్లో, గోవా, రియో డె జానెరియో, బ్రిజిల్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. ఈచిత్రానికి హరీష్ జైరాజ్ సంగీతం అందించగా, అనిరుద్ రవిచంద్రన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేసారు. రామ్ జీ సినిమాటోగ్రఫీ అందించారు. ఫరూఖ్, సత్యం శివకుమార్, సోనుసూద్, ఢిల్లీ గణేష్, అను హాసన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. అవతార్ చిత్రానికి పని చేసిన హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈచిత్రానికి స్పెషల్ ఎఫెక్ట్స్ అందించారు.

  ఈ రోజు విడుదలైన ఈచిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా చూసిన వారు ట్విట్టర్లో తమదైన రీతిలో స్పందించారు. వారి అభిప్రాయాలపై ఓ లుక్కేద్దాం...

  KK ‏@Kriskk11

  KK ‏@Kriskk11


  ఫస్టాఫ్ ఓకే..సెకండాఫ్ మైండ్ బ్లోయింగ్. ఇది టాక్. మైడ్ బ్లోయింగ్ అండర్ లైన్ చేయబడింది.

  PopCorner ‏@PopCorner2

  PopCorner ‏@PopCorner2


  వర్ణానికి అందనిది, ఊహను వెక్కిరించేది, ఓపికను నశింపజేసేది...ఏదైనా సరే వర్ణ తరువాతే...

  Survi ‏@PavanSurvi

  Survi ‏@PavanSurvi


  వర్ణ...టిల్ ఇంటర్వెల్..‘వర్ణ'నాతీతమ్. దూరంగా ఉంటే బెటర్

  Pradeep ‏@trulypradeep

  Pradeep ‏@trulypradeep


  సెంకండాఫ్ స్టార్ట్ అయ్యి 20 నిమిషాలైంది. ప్రతి సీన్ అరాచకం. ఫస్టాఫ్‌ని దాటేసింది.

  RJV ‏@RJV4U

  RJV ‏@RJV4U


  ఏమని వివరించను వర్ణ గురించి...ఏం తీసారు సెల్వ సార్...ఏంటి సార్ మాకు ఈ టార్చర్

  BHA ‏@midemigod

  BHA ‏@midemigod


  మా సజీవ సమాధి ఇప్పుడే జస్ట్ ఇప్పుడే జరిగి పోయింది. వెన్యూ: ప్రసాద్ ఐమాక్స్. ఫస్టాఫ్ : చెత్తగా ఉంది సున్నాను 100 సార్లు వేసుకోండి.

  PopCorner ‏@PopCorner2

  PopCorner ‏@PopCorner2


  ఇంటర్వెల్‌లో ఒక అనుష్క, ఒక ఆర్య. ఇద్దరూ డిఫరెంట్ వరల్డ్స్ నుంచి వచ్చారు. స్టోరీనే అదోలా ఉంది.

  Raja Satish ‏@Rajaism

  Raja Satish ‏@Rajaism


  అనిరుధ్ రవిచందర్ చెత్త చెత్త చేసాడు. చూడలేక పోతున్నాం...

  PopCorner ‏@PopCorner2

  PopCorner ‏@PopCorner2


  మహింద్రా డేంజర్ జంతువుతో పోరాడి దాన్ని చంపేస్తాడు..ఏంటో? మనం కేవలం మనుషులం, దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం.

  Ravi kiran ‏@kinnuPSPK

  Ravi kiran ‏@kinnuPSPK


  హమ్మయ్య ఇంటర్వల్...మరి ఇంకేంటి, క్లాస్‍‌కి టైం అవుతోంది నేను వెళ్లిరానా. వర్ణ ఫస్టాఫ్ సూపర్ విజువల్ ఎఫెక్ట్స్. కంటెంట్ జీరో. సోది మూవీ

  First Day First Show ‏@movie_updatez

  First Day First Show ‏@movie_updatez


  ఇంటర్వెల్...చా యెదవ జీవితం... మనసారా తిడదామన్నా కూడా ఒక్క ముక్క అర్థం కావడం లేదు. ఏంటీ ఈ రచ్చ...

  PopCorner ‏@PopCorner2

  PopCorner ‏@PopCorner2


  ఓవరాల్‌గా గ్రాఫిక్స్ బాగున్నాయి. స్క్రీన్ ప్లే డిసెంట్. యాక్షన్ సీన్లతో పోల్చుకుంటే స్టోరీ కూడా ఫర్వాలేదు. కానీ నేరేషన్ చాలా చెత్తగా ఉంది.

  BHA ‏@Mrutyunjayud

  BHA ‏@Mrutyunjayud


  వర్ణ..మేము ఏ లోకంలో ఉన్నామో కాస్త చెప్పగలరా...(మాకు ఇప్పుడు ఓదార్పు కావాలి)

  English summary
  Arya and Anushka Shetty's Telugu movie Varna has been creating buzz ever since director Selvaraghavan announced this project. Adding to the hype of the film are its promos, which have soared up the viewers' curiosity to the sky high.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more