»   » అనుష్క చేసే విన్యాసాలు ఆకట్టుకొంటాయి

అనుష్క చేసే విన్యాసాలు ఆకట్టుకొంటాయి

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  హైదరాబాద్ : హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రలవైపు దృష్టిసారిస్తోంది అనుష్క. ఈ కోవలో 'అరుంధతి', 'రాణిరుద్రమ'లాంటి అవకాశాలు చేజిక్కించుకొంది. ఇప్పుడు 'వర్ణ'గా ముస్తాబవుతోంది. అనుష్క ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం 'వర్ణ'. ఆర్య హీరో. సెల్వరాఘవన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పివిపీ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. వచ్చే నెలలో పాటల్ని విడుదల చేస్తారు.

  నిర్మాత పరం వి.పొట్లూరి మాట్లాడుతూ ''సాంకేతిక హంగులతో రూపుదిద్దుకొంటున్న చిత్రమిది. హాలీవుడ్‌ నిపుణులు ఈ సినిమా కోసం పనిచేశారు. అనుష్క నటన, ఆమె చేసే విన్యాసాలు తప్పకుండా ఆకట్టుకొంటాయి. హారిష్‌ జయరాజ్‌ సంగీతం అందించారు''అన్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని ఒకేసారి విడుదల చేయనున్నారు.

  దర్శకుడు మాట్లాడుతూ... ''జార్జియా దేశంలో తెరకెక్కించిన సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అక్కడ 18వ శతాబ్దంనాటి భవంతిలో చిత్రించిన దృశ్యాలు కీలకమైనవి''అని తెలిపాయి. గతంలో 'యుగానికి ఒక్కడు' లాంటి విభిన్నమైన సినిమాలు తెరకెక్కించిన సెల్వరాఘవన్ ఈ సినిమానే ఎలా చూపించబోతున్నాడు అనే ఆసక్తి నెలకొంది.

  అనుష్క, తమిళ హీరో ఆర్య జంటగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో తమిళంలో 'ఇరండమ్ ఉలగమ్' అనే చిత్రానికి తెలుగు టైటిల్ 'బృందావనంలో నందకుమారుడు' కాకుండా 'వర్ణ' అని మార్చిన సంగతి తెలిసిందే. ఆ మధ్య ఇందుకు సంబంధించిన ఫస్ట్‌లుక్ ఫోటోలు విడుదల చేసారు. గతంలో 'అరుంధతి' చిత్రంలో కత్తి పట్టిన అనుష్క....వర్ణ చిత్రంలో కత్తి పోరాటాలు చేస్తూ సాహస యువతిగా కనిపించనుంది.

  ఈ చిత్రంలో అనుష్క ద్విపాత్రాభినయం చేస్తోంది. ఒక పాత్రలో ఆమె సాధారణ గృహిణిగా, ఒక పాత్రలో ట్రైబల్ ఉమన్(ఆటవిక యువతి)గా కనిపించనుంది. జార్జియా అడవుల్లో అనుష్కపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సినిమాలో పోషిస్తోన్న విలక్షణమైన పాత్ర కోసమే అనుష్క మార్షల్ ఆర్ట్స్ ని సైతం నేర్చుకుంది. అరుంధతి తర్వాత అనుష్కకు ఈచిత్రం బాగా పేరు తెస్తుందనే టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. సాహిత్యం: చంద్రబోస్‌.

  English summary
  Anushka Shetty and Arya starrer Varna’s audio launch (Telugu version) will happen post 15th August. The film is being made simultaneously in Telugu and Tamil. The Tamil version will have its audio launch early in August. Produced by PVP cinemas, Selva Raghavan has directed the film. Varna has been shot extensively in the former Soviet Union country of Georgia. Music has been scored by Harris Jeyaraj.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more