»   » అనుష్క షో... ఏకంగా మహేష్ బాబు ఇంట్లోనే!

అనుష్క షో... ఏకంగా మహేష్ బాబు ఇంట్లోనే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత బిజీగా ఉంటారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వరుస సినిమాల షూటింగుల్లో ఖాళీ లేకుండా గడిపే ఆయన...ఏ చిన్న సయమం దొరికినా కుటుంబంతో గడపడానికే ఇష్టపడతారు. సాధారణంగా ఇండియాలో ఆయన ఇళ్లు, షూటింగు స్పాట్లు, ఏదైనా వాణిజ్య ప్రకటనల ప్రమోషన్లలో తప్ప మరెక్కడా కనిపించరు.

మరి అలాంటి బిజీ పర్సన్‌కు థియేటర్లకు వెళ్లి తెలుగు సినిమాలు చూసేంత వీలు ఎక్కడుంటుంది చెప్పండి. అందుకే ఆయన ఇంట్లో ఓ మినీ థియేటర్ ఏర్పాటు చేసుకున్నారు. ఏ కొత్త తెలుగు సినిమా అయినా, ఇతర సినిమాలైనా విడుదలైన వెంటనే నేరుగా ఆయన ఇంటికి వెళ్లాల్సిందే.

తాజాగా ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో అనుష్క, ఆర్య జంటగా పివిపి బేనర్ తెరకెక్కించిన 'వర్ణ' చిత్రం స్పెషల్ షోను మహేష్ బాబు చూసే ఏర్పాట్లు చేసారు నిర్మాతలు. భారీ బడ్జెట్ చిత్రం కావడం, యుగానికొక్కడు లాంటి హిట్స్ ఇచ్చిన దర్శకుడు తెరకెక్కించిన భారీ గ్రాఫిక్స్‌తో కూడిన చిత్రం కావడంతో మహేష్ బాబు ఈ చిత్రం చూడటానికి మొదటి నుండీ ఆసక్తి చూపుతున్నారట.

ప్రస్తుతం మహేష్ బాబు నటించిన '1'(నేనొక్కడినే) చిత్రం షూటింగు పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈచిత్రం సంక్రాంతికి సందర్భంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నెక్ట్స్ మహేష్ బాబు శ్రీను వైట్ల దర్శకత్వంలో 'ఆగడు' చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారు.

English summary
Tollywood super star Mahesh Babu wanted to watch Anushka’s latest release Varna. Inspired by the impressive trailers as well as audio tunes Mahesh planned to watch the film having special screening at his home.
Please Wait while comments are loading...