»   » పాటల వరుడు: అల్లు అర్జున్

పాటల వరుడు: అల్లు అర్జున్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్ కథానాయకుడుగా యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న చిత్రం 'వరుడు" ఈ చిత్రానికి సంబంధించిన పాటలను ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ నెల 7న మార్కెట్లో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత డివివి దానయ్య మాట్లాడుతూ 'ఈ చిత్రానికి అల్లు అర్జున్ నటన, గుణశేఖర్ దర్శకత్వ ప్రతిభతో చక్కగా రూపొందుతోంది. ఈ చిత్రానికి మణిశర్మ మంచి బాణీలను అందించారు. గుణశేఖర్, మణిశర్మ కాంబినేషన్ లో వస్తున్న ఈ పాటలు మంచి విజయాన్ని సాధిస్తాయన్న నమ్మకం మాకుంది.

ఈ నెల 26న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అల్లు అర్జున్ సరసన కొత్త అమ్మాయి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ హీరో ఆర్య విలన్ గా చేయడం వేశేషం" అని చెప్పారు. సుహాసిని, నరేష్, ఆశిష్ విద్యార్ధి, షాయాజీషిండే, సంగీతం శ్రీనివాసరావు, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, వినయ్ ప్రసాద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ హైలెట్ గా నిలిచింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X