»   » 1500 రూపాయలు అమ్మిన 'వరుడు' టిక్కెట్టు

1500 రూపాయలు అమ్మిన 'వరుడు' టిక్కెట్టు

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్, గుణశేఖర్ కాంబినేషన్లో వచ్చిన 'వరుడు' చిత్రం నిన్న(బుధవారం) రిలీజైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం హై క్లాస్ టిక్కెట్లు 1500 రూపాయల వరకూ అమ్ముడు పోయి రికార్డు సృష్టించింది. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సుదర్శన్ సెవెంటీ ఎంఎం ధియోటర్ లో విడుదలైన వరుడు చిత్రం టిక్కెట్లు అన్నీ బ్లాక్ మార్కెట్లో అమ్ముడు కావటంతో రెండు గంటలు సేపు క్యూలో నిలుచున్నప్పటికీ టిక్కెట్లు దొరకలేదు. దాంతో వారంతా ఒక్కసారిగా ఎగబడటంతో బ్లాక్ లో వరుడు రేటు పెరిగిపోయి పదిహేను వందల వద్ద సెటిల్ అయింది. ఇక అక్కడే మీడియా కవర్ చేస్తూ ఉన్నా ఎవరూ లెక్క చేయని పరిస్దితి. మరో ప్రక్క నగరంలోని 25 పోలీస్ స్టేషన్ పరిధిలో కర్ఫ్యూ, 144 సెక్షన్ అమలులో ఉంది. అలాగే ఆర్టీసీ క్రాస్ రోడ్ కు అత్యంత సమీపంలో ఉన్న భోలక్ పూర్ లో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతున్నప్పటికీ వరుడు సినిమాకు పెద్ద ఎత్తున ప్రేక్షకులు తరలి వచ్చారు. దాంతో బ్లాక్ లో టిక్కెట్లు అమ్ముతున్నవారి అదృష్టం పండినట్లు అయింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu