»   » ‘వరుడు’ తో బాలయ్యకు, జూ ఎన్టీఆర్ కి లైన్ క్లియర్!

‘వరుడు’ తో బాలయ్యకు, జూ ఎన్టీఆర్ కి లైన్ క్లియర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాష్ట్రంలో నాలుగు నెలలుగా నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపధ్యంలో నానా ఇబ్బందులూ ఎదుర్కొంటోన్న సినీ పరిశ్రమ, సమ్మర్ సీజన్ పై బోల్డన్ని ఆశలే పెట్టుకుంది ఈ సీజన్ కి సంబందించి తొలుతగా అదష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. 'వరుడు" అల్లు అర్జున్.

భారీ స్థాయిలో విడుదల కానున్న 'వరుడు" సినిమాని తెలంగాణలో అడ్డుకునేందుకు తెలంగాణ వాదులు అప్పుడే సమాయత్తమవుతున్నారు. అయితే 'ఆర్య 2"తో తగిలిన స్ట్రోక్ కారణంగా, 'వరుడు" సినిమా సక్సెస్ పై అల్లు అర్జున్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 'వరుడు" కి ఆటంకాలు ఎదురు కాకూడన్న కోణంలో దర్శక నిర్మాతలు అన్ని ముందస్తు జాగ్రత్లలు తీసుకుంటున్నారట.

కాగా 'వరుడు" సినిమాని అడ్డుకుంటామని ఇప్పటిదాకా తెలంగాణవాదులెవరూ బహిరంగంగా ప్రకటన చేయకపోవడం కొతమేర అల్లు అర్జున్ కి ఊరటనిచ్చే అంశమే. 'వరుడు" గనుక ఎలాంటి ఇబ్బందులూ లేకుండా విడుదలైతే, ముందు ముందు విడుదల కానున్న 'సింహా", 'బృందావనం", 'పులి" చిత్రాలకు లైన్ క్లియర్ అయినట్టే !

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu