»   » అల్లు అర్జున్ ‘వరుడు’ చివరి పాటకు రెడీ!

అల్లు అర్జున్ ‘వరుడు’ చివరి పాటకు రెడీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ ల కాంబినేషన్ లో యూనివర్సల్ మీడియా పతాకంపై హిట్ చిత్రాల నిర్మాత డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న చిత్రం 'వరుడు". బన్నీ గత చిత్రాలకంటే చాలా డిఫరెంట్ క్యారెక్టర్ ఈ చిత్రంలో చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ఓ కొత్త హోరోయిన్ పరిచయం అవుతోంది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో రూపొందుతున్న ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత డి.వి.వి. దానయ్య మాట్లాడుతూ అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోల్లో వేసిన భారీ సెట్స్ లో హీరో, హీరోయిన్, తో బ్యాలెన్స్ పాట చిత్రీకరణ మార్చి 5 నుండి 10 వరకు జరుగతుంది. సో ఈ పాట చిత్రీకరణతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. అలాగే 100 కుంటుంబాలకు పైగా వారి కుటుంబ సభ్యులతో కలిసి నటించడం ఈ చిత్రానికి ఒక హైలెట్ గా చెప్పుకోవచ్చు. డబ్బింగ్ పూర్తి అవుతుంది. ప్రస్తుతం రీ-రికార్డిగ్ జరుగుతోంది అన్నికార్యక్రమాలు పూర్తి చేసి మార్చి 26న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. తమిళ హీరో ఆర్య విలన్ గా నటించడం విశేషం. ఇంకా ఈ చిత్రంలో సుహాసిని, నరేష్, ఆశిష్ విద్యార్థి, షాయాజి షిండే, సంగీతం శ్రీనివాస్, బ్రహ్మానందం, తదితరులు నటిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu