»   » రాంచరణ్ నాకు బెస్ట్ ఫ్రెండ్.. సౌత్‌లో ఆ ఇద్దరు దర్శకులతో సినిమా చేయాలని!

రాంచరణ్ నాకు బెస్ట్ ఫ్రెండ్.. సౌత్‌లో ఆ ఇద్దరు దర్శకులతో సినిమా చేయాలని!

Subscribe to Filmibeat Telugu

వరుణ్ ధావన్ నటించిన తాజా చిత్రం అక్టోబర్ విడుదలై మంచి స్పందన దక్కించుకుంది. సినీ విశ్లేషకుల నుంచి కూడా ఈ చిత్రానికి మంచి రివ్యూ లు వస్తున్నాయి. ఇటీవల వరుణ్ ధావన్ మీడియాతో మాట్లాడుతూ సౌత్ ఇండియన్ భాషల్లో నటించాలనే తన కోరికని బయట పెట్టాడు.

సౌత్ లో ఇద్దరు దర్శకుల చిత్రాల్లో నటించే అవకాశం వస్తే వదులుకోనని వరుణ్ ధావన్ తెలిపాడు. రాజమౌళి, శంకర్ దర్శకత్వంలో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని తెలిపాడు. తనకు ఎప్పటినుంచో సౌత్ లో నటించాలనే కోరిక ఉందని వరుణ్ ధావన్ తెలిపాడు.

Varun Dhawan wants to work with two South Indian directors

సౌత్ లో తనకు రాంచరణ్ మంచి స్నేహితుడని వరుణ్ అభిప్రాయ పడ్డాడు. తాను తెలుగు నేర్చుకోవాలని చరణ్ తనని కోరినట్లు వరుణ్ ధావన్ తెలిపాడు. సౌత్ చిత్రాలని తాను తరచుగా చూస్తుంటానని తెలిపాడు. ఇటీవల కాలంలో తనకు అర్జున్ రెడ్డి చిత్రం చాలా బాగా నచ్చిందని వరుణ్ అన్నాడు. మలయాళం చిత్రాలు అద్భుతమైన కథలతో తెరకెక్కుతాని అందులో ఉన్న కిటుకు తనకు అర్థం కావడం లేదని వరుణ్ తెలిపాడు.

English summary
Varun Dhawan wants to work with two South Indian directors. Ram Charan is my good friend says Varun Dhavan
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X