»   » 36 గంటల ప్రేమ ప్రయాణం

36 గంటల ప్రేమ ప్రయాణం

Posted By:
Subscribe to Filmibeat Telugu

మీ శ్రేయాభిలాషి చిత్రంతో దర్శకుడుగా మంచి పేరు తెచ్చుకున్న ఈశ్వర రెడ్డి తాజా చిత్రం బ్రమ్మిగాడు కథ ఈ రోజు(శుక్రవారం)విడుదలవుతోంది. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ శివ అనే ఇంజనీరింగ్‌ విద్యార్థిగా కనిపిస్తాడు. పరీక్షలు రాయడానికి గుల్బర్గా బయలుదేరిన అతనికి రైలు ప్రయాణంలో మాయ (అస్మితాసూద్‌) పరిచయం అవుతుంది. ఆమెకి కొన్ని సమస్యలుంటాయి. వాటిని శివ ఎలా పరిష్కరించాడు? వీరి మధ్యలో పండు (కృష్ణుడు) ఎన్ని తిప్పలు పడ్డాడనేదే సినిమా కథ. ఈ ముగ్గురి కథలకూ బ్రమ్మిగాడికీ సంబంధం ఏమిటనేది సస్పెన్స్‌.ఇక ఈ చిత్రం గురించి దర్శకుడు చెబుతూ ''36 గంటల్లో సాగే కథ ఇది. బ్రమ్మిగాడు ఎవరనేది ఇప్పటి వరకూ చెప్పలేదు. ఆ విషయం తెర మీద చూసి తెలుసుకోవల్సిందే. వినోదాత్మకంగా సాగే సినిమా ఇది. శివ-మాయల ప్రేమ కూడా అందరికీ నచ్చుతుందన్నారు.

సంస్థ: మల్టీడైమెన్షన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి.
నటీనటులు: వరుణ్‌సందేశ్‌, అస్మితాసూద్‌, కృష్ణుడు, పూనమ్‌కౌర్‌, బ్రహ్మానందం, అలీ, నాగినీడు, డా||శివప్రసాద్‌ తదితరులు.
నిర్మాత: రజత్‌ పార్థసారధి
దర్శకత్వం: వి.ఈశ్వర్‌రెడ్డి

English summary
Varun Sandesh’s new film Brahmigadi Katha is gearing up for its releasing today. Asmitha Sood and Poonam Kaur played the leading ladies in the film .Brahmigadi Katha directed by Eeswar Reddy and produced by Rajat Pardhasaradhi on Multi Dimensions banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu