»   » అమ్మాయిల్ని కించపరచాలని కాదు...వరుణ్ సందేశ్ వివరణ

అమ్మాయిల్ని కించపరచాలని కాదు...వరుణ్ సందేశ్ వివరణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

అమ్మాయిల్ని కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఉన్నది ఉన్నట్టు ధైర్యంగా చెప్పడం వల్లే ఈ సమస్య. అమీర్‌పేటలోని యువతరం భావాలు ఎలా ఉంటాయో చూపించాం. అక్కడి హాస్టళ్లలో అమ్మాయిలు ఎలా ప్రవర్తిస్తున్నారో చెప్పాం అంటూ చెప్పుకొచ్చారు వరుణ్ సందేశ్. క్రిందటి వారం విడుదలైన వరుణ్ తాజా చిత్రం 'ఏమైంది ఈ వేళ' చిత్రంలో అమీర్ పేట హాస్టల్స్ లో ఉండే అమ్మాయిల ప్రవర్తన బాగోలేదని, సెక్స్ కోసమే తపిస్తున్నట్లు చూపెట్టారని విమర్శలు వస్తున్న నేపధ్యంలో మీడియాను కలసిన వరుణ్ ఇలా స్పందించారు. అలాగే తమ చిత్రంపై వచ్చిన రివ్యూలు గురించి ప్రస్దావిస్తూ...

కొన్ని రివ్యూలు నిరుత్సాహపరిచినా..పాజిటివ్‌ రివ్యూలు ఉత్సాహాన్నిచ్చాయి. హాస్టల్స్‌ని నెగెటివ్‌ గా చూపించడం బహుశా కొందరికి నచ్చి ఉండకపోవచ్చు. అదీ యువత భవిత చెడిపోకూడదనే సందేశం ఇవ్వాలని చేసిన ప్రయత్నం మాత్రమే. పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరాన్ని అందులో చూపించాం అన్నారు. ఈ చిత్రం ద్వారా సంపత్‌నంది దర్సకుడుగానూ, నిషా అగర్వాల్(కాజల్ చెల్లెలు) హీరోయిన్ గానూ పరిచయం అయ్యారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu